OnePlus Nord Series Launch : వన్‌ప్లస్ నుంచి 2 కొత్త నార్డ్ సిరీస్ ఫోన్లు.. ఈరోజే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమ్ చూడాలంటే?

OnePlus Nord Series Launch : భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో OnePlus Nord 3, OnePlus Nord CE 3, OnePlus బడ్ 2R రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కంపెనీ లాంచ్ చేయనుంది.

OnePlus Nord Series Launch : వన్‌ప్లస్ నుంచి 2 కొత్త నార్డ్ సిరీస్ ఫోన్లు.. ఈరోజే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమ్ చూడాలంటే?

OnePlus Nord Series Launch

Updated On : July 5, 2023 / 4:38 PM IST

OnePlus Nord Series Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి నార్డ్ సిరీస్‌లో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. భారత మార్కెట్లో ఈరోజు (జూలై 5న) అధికారికంగా వన్‌ప్లస్ నార్డ్ 3, వన్ ప్లస్ నార్డ్ CE 3 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త Nord డివైజ్‌లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 7:00PM IST గంటలకు జరిగే నార్డ్ సమ్మర్ లాంచ్ (Nord Summer Launch) ఈవెంట్లో ఆవిష్కరించనుంది. వన్‌ప్లస్ అభిమానులు OnePlus అధికారిక YouTube ఛానెల్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఈ కొత్త Nord ఫోన్‌లు ఈ ఏడాది ప్రారంభంలో OnePlus ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌ను నిర్వహించగా.. కంపెనీ మొదటి టాబ్లెట్, OnePlus 11,11R స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.

వన్‌ప్లస్ Nord 3, Nord CE 3 ఫీచర్లు (అంచనా) :
వన్‌ప్లస్ అభిమానులు OnePlus ఇండియా అధికారిక ఛానెల్‌ (YouTube) ద్వారా రాత్రి 7PM నుంచి లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. కంపెనీ తన సోషల్ మీడియా ఛానెల్‌లలో లైవ్ అప్‌డేట్‌లను కూడా పోస్ట్ చేస్తుంది. అధికారిక లాంచ్‌కు ముందు, OnePlus రాబోయే OnePlus Nord 3, OnePlus Nord CE 3, OnePlus బడ్ 2R ముఖ్య స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. Nord 3 ప్రత్యేకమైన OnePlus స్లైడర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు ఫిజికల్ టోగుల్‌తో ఆడియో మోడ్‌లను కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సెగ్మెంట్‌లోని పోటీదారుల మాదిరిగా కాకుండా.. నార్డ్ సిరీస్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Read Also : Vodafone Idea Plans : వోడాఫోన్ రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

వినియోగదారులు టెంపెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్ కలర్స్ మధ్య ఎంచుకోవచ్చు. బ్యాక్ ప్యానెల్‌లో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన సోనీ IMX-890 కెమెరా సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా ముందు భాగంలో హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. అంతేకాకుండా, Nord 3 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. OnePlus Nord 3 ఫోన్ 16GB RAM కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ ఫస్ట్ Nord స్మార్ట్‌ఫోన్ ధర బేస్ వేరియంట్ దాదాపు రూ. 33,000గా ఉంటుందని అంచనా.

OnePlus Nord Series Launch

OnePlus Nord Series Launch

Nord CE 3, Nord 3 టోన్డ్-డౌన్ వేరియంట్‌గా రావొచ్చు. టోన్డ్-డౌన్ స్పెసిఫికేషన్‌ల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ చాలా సరసమైనదిగా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 782G SoC, 5,000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ Nord 3 మాదిరిగానే 80W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Nord CE 3 కూడా 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Nord CE 2లోని LCD ప్యానెల్‌పై అప్‌గ్రేడ్‌తో రానుంది. సెల్ఫీ కెమెరా హోల్-పంచ్ కటౌట్ లోపల ఉండవచ్చు.

Nord CE 3 ఫోన్ బ్యాక్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. నార్డ్ 3 మాదిరిగానే ఉంది. వెనుక కెమెరా సిస్టమ్ OISతో కూడిన 50MP Sony IMX 890 కెమెరా సెన్సార్‌తో వస్తుంది. Nord CE 3 ఆక్వా సర్జ్ కలర్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒరిజినల్ Nord ఫోన్ టీల్ బ్లూను పోలి ఉంటుంది. చివరగా, నోర్డ్ బడ్స్ 2R సిలికాన్, రియల్ నార్డ్ బడ్స్‌ను పోలి ఉంటుంది. OnePlus ఇయర్‌బడ్స్ ఫీచర్ 12.4mm డ్రైవర్లు, బ్లూటూత్ 5.3 కలిగి ఉంటుంది. ఇయర్‌బడ్‌లు కేస్‌తో 38 గంటల బ్యాకప్‌ని అందిస్తాయి.

Read Also : Ola Electric : ఈవీ 2W విభాగంలో తిరుగులేని ఆధిపత్యం.. జూన్‌లో 40 శాతం వాటాతో అగ్రగామిగా ఓలా ఎలక్ట్రిక్..!