OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Open Launch : వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్‌’ (OnePlus Open Foldable Phone)ను అక్టోబర్ 19న లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Open launch on October 19_ What to expect

OnePlus Open Launch : వన్‌ప్లస్ అభిమానులకు అదిరే న్యూస్.. గత కొన్ని రోజులుగా, (OnePlus) రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ (OnePlus Open) ఫోల్డబుల్ ఫోన్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. రాబోయే ఈ మడతబెట్టే ఫోన్ కంపెనీ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. టెక్ ఔత్సాహికులు, వన్‌ప్లస్ యూజర్లు (OnePlus Customers) ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు.

Read Also : Itel A05s Smartphone : ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అదిరిందిగా.. దిమ్మతిరిగే ఫీచర్లతో ఐటెల్ A05s ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ఈ మడతబెట్టే ఫోన్ లాంచ్ కావడానికి ముందు అనేక ఊహాగానాలు, లీక్‌లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ మైఖేల్ ఫిషర్ తన ఛానల్‌లో వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ ఫస్ట్-లుక్‌ను కూడా పోస్ట్ చేశాడు. వన్‌ప్లస్ ఓపెన్ లాంచ్ (OnePlus Open Launch in India)కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అక్టోబర్ 19నే వన్‌ప్లస్ ఓపెన్ లాంచ్ :
వన్‌ప్లస్ ఓపెన్ అక్టోబర్ 19న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ ముంబైలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్ ముందుగా ట్వీట్‌లో లాంచ్ తేదీ, సమయాన్ని ధృవీకరించింది.

వన్‌ప్లస్ ఓపెన్ : స్పెషిఫికేషన్లు, భారత్ ధర (అంచనా) :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోల్డబుల్ ఫోన్ అంచనా ధరను రివీల్ చేశారు. ఈ ఫోన్ ధర రూ.1,39,999గా ఉండవచ్చని ఆయన చెప్పారు. అయితే, ఇది అధికారిక ధర కాదని గమనించాలి. మడతబెట్టే ఫోన్ ధర వివరాలు పూర్తిగా తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందేనని యాదవ్ సూచించారు.

OnePlus Open launch on October 19_ What to expect

OnePlus Open launch

వన్‌ప్లస్ ఫోన్ స్పెషిఫికేషన్లపై ఆయన మాట్లాడుతూ.. వన్‌ప్లస్ ఓపెన్ డ్యూయల్ డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రధాన డిస్‌ప్లే ఇన్నర్ డిస్‌ప్లే సైజు 7.8 అంగుళాలు, 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించగలదని భావిస్తున్నారు. ఔటర్ డిస్‌ప్లే 6.31 అంగుళాలు ఉండవచ్చని అంచనా. 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉండవచ్చు.

అద్భుతమైన కెమెరా ఫీచర్లు :
ప్రాసెసర్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ఓపెన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. వన్‌ప్లస్ ఐకానిక్ అలర్ట్ స్లైడర్ డివైజ్ వివిధ ఫొటోలలో కూడా కనిపించింది. ఈ అలర్ట్ స్లైడర్ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్‌కి సరిపోయేలా కస్టమైజ్ చేసుకోవచ్చునని భావిస్తున్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోల్డబుల్ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీతో రావచ్చు. ఇప్పటి వరకు ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. రాబోయే వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లాంచ్ తర్వాత మాత్రమే రివీల్ చేసే అవకాశం ఉంది.

Read Also : OnePlus 11 5G Low Price : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!