OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 19నే లాంచ్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Open Launch : ఎట్టకేలకు ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ (OnePlus Open) అధికారిక లాంచ్ తేదీని వన్‌ప్లస్ (OnePlus) ప్రకటించింది. అక్టోబర్ 19న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. రాబోయే వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ అంచనా ధర, స్పెషిపికేషన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 19నే లాంచ్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Open will launch in India on October 19, company confirms

OnePlus Open Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) ఎట్టకేలకు ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ (OnePlus Open) అధికారిక లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ డివైజ్ వచ్చే వారం అంటే.. అక్టోబర్ 19న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్ ప్రస్తుతం శాంసంగ్ ఆధిపత్యంలో ఉంది. వినియోగదారులకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించాలని వన్‌ప్లస్ సూచిస్తోంది. మంచి విషయం ఏమిటంటే.. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు వన్‌ప్లస్ ఓపెన్ ఈవెంట్‌కు ముందే లీక్ అయ్యాయి.

Read Also : OnePlus 11R 5G : భలే ఉంది భయ్యా ఈ ఫోన్.. కొత్త సోలార్ రెడ్ కలర్‌తో వన్‌ప్లస్ 11R 5G ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

లాంచ్ చేయడానికి కొన్ని రోజుల ముందు.. వినియోగదారులు వేగవంతమైన పర్ఫార్మెన్స్ పొందుతారని OnePlus పేర్కొంది. ఫోల్డబుల్ ఫోన్ కూడా తేలికైనదని, స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఓపెన్ స్క్రీన్ క్రీజ్‌పై క్రీజ్‌లు లేవని వన్‌ప్లస్ చెబుతోంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వన్‌ప్లస్ ఓపెన్ ప్రస్తుత ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల పరిమితులను పెంచే ఆల్ రౌండ్ ఫ్లాగ్‌షిప్-లెవల్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని కంపెనీ తెలిపింది.

OnePlus Open will launch in India on October 19, company confirms

OnePlus Open Launch launch

వన్‌ప్లస్ ఓపెన్.. భారత్‌లో లీకైన ధర :
లీక్‌లను విశ్వసిస్తే.. వన్‌ప్లస్ ఓపెన్ ధర 1,699 డాలర్లు (సుమారు రూ. 1,41,490)గా ఉండవచ్చు. డివైజ్ ఇదే రేంజ్‌లో ధర నిర్ణయించవచ్చు లేదా అమెరికా మార్కెట్ కన్నా తక్కువగా ఉండవచ్చు. వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్‌కు ధరను ఎలా నిర్ణయించనుందో తెలియాలంటే లాంచ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

వన్‌ప్లస్ ఓపెన్ : లీకైన స్పెసిఫికేషన్‌లు :

వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా స్పెసిఫికేషన్‌లను ధృవీకరించనప్పటికీ.. రాబోయే ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ చేస్తే.. 7.8-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుందని లీక్ డేటా పేర్కొంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. కవర్ డిస్‌ప్లే అదే రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ ఓపెన్ ఎలాంటి వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందించకపోవచ్చని చెబుతున్నారు. Qualcomm ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో గరిష్టంగా 18GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో పవర్ పొందే అవకాశం ఉంది. అలెర్ట్ స్లైడర్ కూడా ఉంటుందని అధికారిక టీజర్‌లు చూపించాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ గ్యాప్‌లెస్ హింజ్ డిజైన్‌తో వస్తుంది.

Read Also : OnePlus 11 5G Low Price : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!