Delta Plus Software : పాకిస్తానీ బ్రోకర్ల చేతివాటం.. డెల్టా ప్లస్’ సాఫ్ట్‌వేర్‌‌తో IRCTCలో టికెట్ల బుకింగ్!

పాకిస్తాన్ ఆపరేటర్లు IRCTC వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునేందుకు 'డెల్టా ప్లస్' సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు భారత రైల్వే అధికారులు వెల్లడించారు. ఇండియాలో కొవిడ్-19 కొత్త వేరియంట్‌కు ‘Delta Plus’ పేరుతో సాఫ్ట్‌వేర్‌ రూపొందించినట్టు గుర్తించారు.

Delta Plus Software : పాకిస్తానీ బ్రోకర్ల చేతివాటం.. డెల్టా ప్లస్’ సాఫ్ట్‌వేర్‌‌తో IRCTCలో టికెట్ల బుకింగ్!

‘delta Plus’ Software To Book Tickets Through Irctc Website

Updated On : July 1, 2021 / 9:34 AM IST

Delta Plus Software To Book Tickets IRCTC Website : పాకిస్తాన్ ఆపరేటర్లు IRCTC వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునేందుకు ‘డెల్టా ప్లస్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు భారత రైల్వే అధికారులు వెల్లడించారు. ఇండియాలో కొవిడ్-19 కొత్త వేరియంట్‌కు ‘Delta Plus’ పేరుతో సాఫ్ట్‌వేర్‌ రూపొందించినట్టు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా స్థానిక బ్రోకర్ల సాయంతో రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం పాకిస్తాన్ నుంచి నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

గత ఏడాదిలో సౌదీ అరేబియాకు చెందిన రైలు టిక్కెట్ల బ్రోకరింగ్‌ రాకెట్‌‌ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదుపులోకి తీసుకుంది. రైలు టికెట్ బుకింగ్ బ్రోకర్లు ఒక సాఫ్ట్‌వేర్ నుంచి మరొక సాఫ్ట్‌వేర్‌కు మార్చేస్తున్నారు. దాంతో వీటిని నియంత్రించడం కష్టంగా మారుతోంది. సాఫ్ట్‌వేర్‌ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను వేలాది దిగువ స్థాయి స్థానిక బ్రోకర్లకు విక్రయిస్తారు.  అయితే, IRCTC ఇప్పుడు ఫూల్‌ప్రూఫ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది.

ప్రయాణీకుల ఐడెంటిటీ కార్డులైన ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్‌ను అతని / ఆమె అకౌంట్లకు అనుసంధానించడం వల్ల టికెట్ బుకింగ్ వ్యవస్థను అతిక్రమించకుండా బ్రోకర్లను ఆపవచ్చని RPF రైల్వే ఏజెన్సీకి సూచించింది. భవిష్యత్తులో టికెట్ల బుకింగ్ కోసం సెంట్రల్ ఐడి కార్డును IRCTC తప్పనిసరి చేస్తోంది. ఈ కొత్త విధానంతో ఒరిజినల్ టికెట్ బుకింగ్‌లు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. నకిలీ ప్రయాణికులను ఫిల్టర్ చేసేందుకు అధికారులు ప్రయాణ సమయంలో ప్రయాణికుల నమోదు చేసుకున్న ఐడి కార్డును తిరిగి తనిఖీ చేయవచ్చు.

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే కూడా అన్‌లాకింగ్ ప్రారంభించింది. రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలను ఎత్తివేస్తున్నందున అనేక రైళ్లను తిరిగి నడుపుతోంది. వందలాది రైళ్లను తిరిగి నడపటం ద్వారా ప్రయాణీకుల సంఖ్య అధికంగా పెరుగుతోంది. ఈ నెల జూన్ 11, జూన్ 17 మధ్య 32.56 లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించినట్టు ఒక నివేదిక వెల్లడించింది.