QR Codes : క్యూఆర్ కోడ్‌లతో డేటా షేరింగ్ ఈజీ.. ఎలానో తెలుసా?

ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి పరిస్థితుల్లో అంతా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. క్యాష్ కంటే డిజిటల్ మనీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫాంల్లోనే పేమెంట్లు చేసేస్తున్నారు.

QR Codes : క్యూఆర్ కోడ్‌లతో డేటా షేరింగ్ ఈజీ.. ఎలానో తెలుసా?

Qr Codes Smart Way To Share Data, How To Make Your Own

Updated On : June 22, 2021 / 3:27 PM IST

QR codes smart way to share data : ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి పరిస్థితుల్లో అంతా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. క్యాష్ కంటే డిజిటల్ మనీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫాంల్లోనే పేమెంట్లు చేసేస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్ టికెట్లు, బిల్ బోర్డులు ప్రతిదీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారానే స్కాన్ చేసి చెల్లిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో QR కోడ్స్ బాగా పాపులర్ అయ్యాయనే చెప్పాలి. ఈ సెక్యూర్ కోడ్స్ ఈజీగా వాడేందుకు ఎంతో సులభంగా ఉంటాయి కూడా.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఎవరైనా సులభంగా ఈ QR కోడ్స్ వినియోగించుకోవచ్చు. అది కూడా స్మార్ట్ ఫోన్ డిపాల్ట్ కెమెరాతోనే… దీనికి ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్ వేర్ అవసరం కూడా లేదు. QR కోడ్స్.. ఫిజికల్ కాంటాక్ట్ అవసరం లేదు. అలాగే మీకు మీరే సొంతంగా క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద టైమ్ కూడా అక్కర్లేదు.. ఎలాంటి టెక్నికల్ అనుభవం అవసరం లేదు. సింపుల్ గా ఒక యాప్ అవసరం ఉంటుంది.. దాంతో ఈజీగా క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు..

QR కోడ్స్ అంటే ఏంటి? :
క్యూఆర్ కోడ్స్.. 4వేల క్యారెక్టర్ల టెక్స్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ కోడ్.. వెబ్ సైట్ URL స్టోర్ చేయడానికి వాడుతుంటారు. కస్టమర్లు తమ కంపెనీ వెబ్ సైట్ కు రీడైరెక్ట్ అయ్యేందుకు ఈ క్యూఆర్ కోడ్స్ వాడుతుంటారు. ఇందులో కొన్ని ప్యాటర్న్ ద్వారా మీ కాంటాక్ట్ వివరాలను ఎన్ కోడ్ చేసుకోవచ్చు. మీ వివరాలన్నీ క్యూఆర్ కోడ్ రూపంలో సేవ్ అయి ఉంటాయి. మొబైల్ స్కానర్ ద్వారా కోడ్ స్కాన్ చేస్తే చాలు.. మీ వివరాలు కనిపిస్తాయి. సినిమా టికెట్లు కొనుగోలులో కూడా ఈ క్యూఆర్ కోడ్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు.

క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయడానికి మీ దగ్గర వై-ఫై నెట్ వర్క్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. లేదంటే Airbnb rental యాప్ కూడా వాడొచ్చు. దీని ద్వారా గెస్ట్స్ యూజర్లు సులభంగా కోడ్ స్కాన్ చేసి కనెక్ట్ కావొచ్చు. ఇందుకోసం నెట్ వర్క్ నేమ్ కానీ, పాస్ వర్డ్ కానీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసుకునేందుకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వెబ్, మొబైల్ యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు.