Realme P3 Series : కొత్త రియల్‌మి P3 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఖతర్నాక్ ఫీచర్లతో మొత్తం 4 మోడల్స్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

Realme P3 Series Launch : రియల్‌మి ఫిబ్రవరి 18న P3 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తోంది. P3x 5G, P3 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ సిరీస్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme P3 Series : కొత్త రియల్‌మి P3 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఖతర్నాక్ ఫీచర్లతో మొత్తం 4 మోడల్స్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

Realme P3x 5G and P3 Pro launching on Feb 18

Updated On : February 17, 2025 / 1:42 PM IST

Realme P3 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త రియల్‌‌మి P3 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. రియల్‌మి కొత్త మోడళ్లలో రియల్‌మి P3 5G, P3x 5G, P3 Ultra, P3 Pro ఫోన్లను లాంచ్ చేయనుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా జీటీ బూస్ట్ టెక్నాలజీతో ఫోన్లలో రానున్నాయి.

Read Also : Post Office Savings Scheme : మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు.. కేవలం ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు!

అన్ని వేరియంట్‌లు రియల్‌మి 2 సిరీస్‌ ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రియల్‌మి P3 ప్రో మోడల్ డ్యూయల్ కెమెరా, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. రియల్‌మి P3 ప్రో లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్ల గురించి అంచనాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

లాంచ్ తేదీ, సమయం వివరాలివే :
రియల్‌మి రాబోయే P3 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీని భారత మార్కెట్లో అధికారికంగా ధృవీకరించింది. రియల్‌మీ P3x 5G ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటలకు హై-ఎండ్ రియల్‌మీ P3 ప్రోతో పాటు లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఇ-స్టోర్ ద్వారా నాలుగు ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

డిజైన్, కలర్ ఆప్షన్లు (అంచనా) :
రియల్‌మి P3x 5జీ సిరీస్ మొత్తం 3 అద్భుతమైన షేడ్స్‌లో లభిస్తుంది. లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ స్టెల్లార్ పింక్ ఉన్నాయి. ఈ సిల్వర్ మోడల్ “స్టెల్లార్ ఐస్‌ఫీల్డ్ డిజైన్”ను కలిగి ఉంటుంది. మైక్రో-లెవల్ లైట్ ప్రత్యేకంగా ఉంటుందని అంచనా. బ్లూ, రోజ్ ఆప్షన్లు ప్రీమియం వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆకర్షణీయమైన ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. కేవలం 7.94mm మందం మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ ప్యానెల్‌లో మధ్యలో హోల్-పంచ్ కెమెరా, స్లిమ్ బెజెల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఫోన్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో నిలువుగా డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

రియల్‌మి P3 Pro ప్రీమియం ఫీచర్లు :
రియల్‌మి P3x 5Gతో పాటు రియల్‌మి మరో 3 మోడల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ సిరీస్ మోడల్స్ హై-ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటాయి. రియల్‌‌మి ప్రో వేరియంట్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ ఏరోస్పేస్-గ్రేడ్ వీసీ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. రియల్‌మి P3 ప్రో మోడల్ స్పెషల్ ఫీచర్ కలిగి ఉంది. 6,000mAh బ్యాటరీతో పాటు స్పీడ్ రీఛార్జింగ్ కోసం 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : PM Kisan 19th Installment : ఈ నెల 24నే పీఎం కిసాన్ డబ్బులు.. కానీ, ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?

మన్నిక పరంగా P3 ప్రో మోడల్ అత్యంత పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు. దుమ్ము, నీటి నిరోధకతకు IP66+IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గెలాక్సీ పర్పుల్, నెబ్యులా గ్లో, సాటర్న్ బ్రౌన్ అనే 3 ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది. అదనంగా, 7.99mm మందంతో సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది.

లాంచ్‌కు ముందే భారీగా అంచనాలు :
రియల్‌మి P3 సిరీస్ ఇప్పటికే టెక్ ఔత్సాహికులలో ఆసక్తిని రేకిత్తిస్తోంది. ముఖ్యంగా ప్రో మోడల్ మెరిసే బ్యాక్ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా ఉండనుంది. రియల్‌మి P3x 5జీ, రియల్‌‌మి P3 Pro రెండూ వచ్చే వారం భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ బ్రాండ్ స్టయిల్, పర్పార్మెన్స్, మన్నికపరంగా ఆకర్షణీయంగా ఉండనుంది. లాంచ్ ఈవెంట్ సమయంలో ఈ రియల్‌మి P3 సిరీస్ ఫోన్ స్పెషిఫికేషన్లు, ధర లభ్యతపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.