Jio Data Plans : జియో చీపెస్ట్ డేటా ప్లాన్లు.. ఈ టాప్ 5 డేటా ప్లాన్లు మీకోసం.. 56GB డేటాతో 28 రోజులు ఎంజాయ్..!

Jio Data Plans : జియో అద్భుతమైన డేటా ప్లాన్ ఆఫర్లు.. జియో చౌకైన డేటా ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Jio Data Plans : జియో చీపెస్ట్ డేటా ప్లాన్లు.. ఈ టాప్ 5 డేటా ప్లాన్లు మీకోసం.. 56GB డేటాతో 28 రోజులు ఎంజాయ్..!

Jio Data Plans

Updated On : November 2, 2025 / 7:54 PM IST

Jio Data Plans : జియో యూజర్లకు పండగే.. రిలయన్స్ జియో సరసమైన ధరకే డేటా ప్లాన్లను అందిస్తోంది. మీరు కూడా డేటా ప్యాక్ కోసం చూస్తుంటే ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి. రూ. 26 నుంచి రూ.182 మధ్య ధర కలిగిన జియో టాప్ 5 అత్యంత సరసమైన డేటా ప్లాన్‌లను అందిస్తోంది.

జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల విషయానికి వస్తే.. ఈ జియో డేటా (Jio Data Plans) ప్లాన్‌లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. జియో అందించే ఈ డేటా ప్లాన్‌ల గురించి ఓసారి పరిశీలిద్దాం.

రూ. 26 ప్లాన్ :
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ 2GB డేటాను అందిస్తుంది.

రూ. 62 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 6GB డేటాను అందిస్తుంది.

Read Also : Tecno Pop 10 4G : కొత్త టెక్నో పాప్ 10 4జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

రూ. 86 ప్లాన్ :
ఈ జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీకు రోజుకు 0.5GB చొప్పున మొత్తం 14GB డేటా లభిస్తుంది.

రూ. 122 ప్లాన్ :
ఈ డేటా ప్యాక్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కంపెనీ రోజుకు 1GB చొప్పున మొత్తం 28GB డేటాను అందిస్తోంది.

రూ.182 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB చొప్పున మొత్తం 56GB డేటాను పొందవచ్చు.

ఫ్రీ కాలింగ్, నో SMS బెనిఫిట్స్ :
ఈ ప్లాన్లు డేటా ప్యాక్‌లు.. కేవలం ఫ్రీ కాలింగ్ మాత్రమే.. ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందలేరు.