Tecno Pop 10 4G : కొత్త టెక్నో పాప్ 10 4జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Tecno Pop 10 4G : టెక్నో నుంచి సరికొత్త 4జీ ఫోన్ లాంచ్ అయింది. 5000mah బ్యాటరీతో 8జీబీ ర్యామ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది. ధర ఎంతంటే?
Tecno Pop 10 4G
Tecno Pop 10 4G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? టెక్నో పాప్ 10 4G వచ్చేసింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ మార్కెట్‌లో భారీ డిస్‌ప్లే, బ్యాటరీలు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో 8జీబీ ర్యామ్ కలిగి ఉంది.
డిజైన్, డిస్‌ప్లే :
టెక్నో పాప్ 10 4G ఫోన్ 6.67-అంగుళాల పెద్ద HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ (Tecno Pop 10 4G) అందిస్తుంది. 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వీడియో లేదా గేమ్‌లు ఆడుతున్నప్పుడు కలర్ అవుట్‌పుట్ అందిస్తుంది. ఫోన్ డిజైన్ విషయానికి వస్తే డెకో డిజైన్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఈ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో చాలా తక్కువగా కనిపిస్తుంది.
డిస్‌ప్లే :
ఈ ఫోన్‌లో యూనిసోక్ T7250 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే.. 4GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. అలాగే, 4GB వర్చువల్ ర్యామ్ కూడా సపోర్టు ఇస్తుంది. మొత్తం ర్యామ్ 8GBకి పెంచుకోవచ్చు. ఈ మల్టీ టాస్కింగ్, యాప్ స్విచింగ్ ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉంటాయి.
కెమెరా :
కెమెరా విషయానికి వస్తే.. టెక్నో పాప్ 10 4G ఫోన్ బ్యాక్ సైడ్ 13MP రియర్ కెమెరా ఉంది. డే, నైట్ రెండూ క్లియర్ ఫొటోలను క్యాప్చర్ తీస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాలింగ్, సోషల్ మీడియా పోస్ట్‌లకు అద్భుతంగా ఉంటుంది. అలాగే, ఫోన్ ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ డ్యూయల్ ఫ్లాష్ ఉంటుంది. తక్కువ కాంతిలో కూడా ఆకర్షణీయమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
బ్యాటరీ :
టెక్నో పాప్ 10 4Gలో 5000mAh బ్యాటరీ ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. మీరు వరుసగా 20 గంటలు వీడియోలను చూడవచ్చు. 60 గంటలు మ్యూజిక్ వినవచ్చు అని కంపెనీ పేర్కొంది. రోజంతా ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించే యూజర్లకు అద్భుతమైన ఆప్షన్.
భారత్ టెక్నో పాప్ ధర :
ధర విషయానికొస్తే.. టెక్నో పాప్ 10 4G ఫోన్ అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు. టెక్నో పాప్ 9 4G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 3GB+64GB వేరియంట్‌లో రూ. 6,499కి అందుబాటులో ఉంది. టెక్నో పాప్ 9 5G ఫోన్ (4GB+64GB) రూ. 8,699కి అందుబాటులో ఉంది. పాప్ 10 4G ధర కూడా ఇదే రేంజ్‌లో ఉంటుందని అంచనా.
