Rocket hits the Moon : చంద్రునికి తప్పిన పెను ముప్పు.. అతిసమీపంగా దూసుకెళ్లిన రాకెట్ శకలం..!

ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఓ భారీ రాకెట్ నుంచి చంద్రునికి పెను ముప్పు తప్పింది. మూడు టన్నుల బరువైన ఆ రాకెట్ శకలం మార్చి 4న (శుక్రవారం) చంద్రునికి అత్యంత సమీపంగా దూసుకెళ్లింది.

Rocket hits the Moon : చంద్రునికి తప్పిన పెను ముప్పు.. అతిసమీపంగా దూసుకెళ్లిన రాకెట్ శకలం..!

Rocket Hits The Moon Chinese Rocket Strikes Far Side Of The Moon

Rocket hits the Moon : ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఓ భారీ రాకెట్ నుంచి చంద్రునికి పెను ముప్పు తప్పింది. మూడు టన్నుల బరువైన ఆ రాకెట్ శకలం మార్చి 4న (శుక్రవారం) చంద్రునికి అత్యంత సమీపంగా దూసుకెళ్లింది. ఇదేరోజున ఆ రాకెట్ చంద్రునికి దగ్గరగా దూసుకొచ్చి ఢీకొట్టే అవకాశం ఉందని ఖగోళ సైంటిస్టులు ముందుగానే అంచనా వేశారు. అయితే ఆ రాకెట్ శకలం గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలంపై నుంచి అతిసమీపంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో రాకెట్ శకలం వేగానికి చంద్రుని ఉపరితలంపై వందల కిలోమీటర్ల వరకు దట్టమైన ధూళి పైకి ఎగిసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.

ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఈ రాకెట్ శకలం అపసవ్య దశలో చంద్రుని దిశగా దూసుకెళ్తోందని, అది కచ్చితగా చంద్రున్ని ఢీకొట్టే అవకాశం ఉందని స్పేస్ ఏజెన్సీలు సైతం అంచనా వేశాయి. ఇంతకీ ఈ రాకెట్ ఎవరిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన రాకెట్ అని కొందరు అంటుంటే.. కాదు కాదు.. అది చైనా ప్రయోగించిన రాకెట్ అని మరికొందరు వాదిస్తున్నారు. చైనా మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ రాకెట్ శకలం చంద్రున్ని ఢీకొట్టినప్పటికీ దాని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ రాకెట్ శకలం పరిశోధకుల టెలిస్కోపులకు చిక్కనంత వేగంగా దూసుకెళ్లింది. వందల కిలోమీటర్ల వరకు ధూళి పైకి ఎగియడంతో శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. ఏం జరిగి ఉంటుందా? అని పరిశీలించారు. అది అదృశమైన రాకెట్ శకలం దూసుకెళ్లిన అనవాళ్లుగా సైంటిస్టులు గుర్తించారు. రాకెట్ శకలం దూసుకెళ్లిన ప్రాంతంలో చంద్రుని చుట్టూ దాదాపుగా 3 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్టు గుర్తించారు.

Rocket hits the Moon : 66 అడుగుల లోతైన బిలం.. అంతరిక్షంలో ఎగసిన భారీ ధూళి.. 
చంద్రునికి అత్యంత సమీపంగా దూసుకెళ్లిన ఈ రాకెట్ శకలం వేగానికి 33 అడుగల నుంచి 66 అడుగుల వరకు లోతైన బిలం ఏర్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. అందుకే ఇంత మొత్తంలో అంతరిక్షంలో ధూళీ ఆవరించి ఉంటుందని గుర్తించారు. రాబోయే కొన్నివారాల్లో దీనిపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని సైంటిస్టులు చెబుతున్నారు. అప్పుడే అదేంటీ ధ్రువీకరించడం సాధ్యపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ రాకెట్ శకలం మార్చి 2015లో మొదటిసారిగా భూమి ఉపరితలానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నాసాకు చెందిన అరిజోనా నిర్వహించే అంతరిక్ష సర్వేలో దీన్ని గుర్తించింది. అది గ్రహశకలం కాదని గుర్తించిన అనంతరం దానిపై ఆసక్తి చూపించలేదు. మరోవైపు.. ఎనిమిదేళ్ల క్రితం చైనా ప్రయోగించిన రాకెట్ శకలంగా సైంటిస్టులు భావిస్తున్నారు. 2014లో చైనా అంతరిక్షనౌకను మోసుకెళ్లిన రాకెట్ శకలమని అభిప్రాయపడుతున్నారు. చైనా ఈ ఆరోపణలను మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. చైనా పంపిన రాకెట్ ఎప్పుడో భూవాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమైపోయిందని అంటోంది.

Rocket Hits The Moon Chinese Rocket Strikes Far Side Of The Moon (1)

Rocket Hits The Moon Chinese Rocket Strikes Far Side Of The Moon

Rocket hits the Moon : స్పేస్ జంక్.. అంతరిక్షంలో రాకెట్ వ్యర్థాలు..
సాధారణంగా రాకెట్ మిగిలిపోయిన శకలాలను ‘స్పేస్ జంక్’ అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చేందుకు తగినంత ఇంధనం లేని మిషన్లు లేదా ఉపగ్రహాలు ఇలా అంతరిక్షంలో తిరుగుతుంటాయి. కొన్నిసార్లు ఈ శకలాలు భూమికి ఎగువన దగ్గరగా వస్తుంటాయి. మరికొన్ని భూమి వాతావరణానికి దూరంగా ఎత్తైన కక్ష్యలో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనా ప్రకారం.. ఇప్పుడు 36,500 స్పేస్ జంక్ శకలాలు 10 సెం.మీ కంటే పెద్దవిగా ఉన్నాయని గుర్తించింది. ఇదిలా ఉండగా.. స్పేస్‌ఎక్స్‌ SpaceX Rocket కంపెనీ ఫాల్కన్‌ 9 బూస్టర్‌ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపింది.

అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించేందుకు ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి లాంచ్ చేశారు. మొదటి దశలో రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. రెండో దశలో ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. ఫాల్కన్‌ 9 బూస్టర్‌ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్ష్యలో పయనిస్తోంది. అప్పటినుంచి అదుపు తప్పి జాడ లేకుండా పోయింది. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఊహించనిరీతిలో ఈ రాకెట్‌ ట్రాక్‌ ఎక్కింది. మార్చి 4న ఈ రాకెట్ శకలం చంద్రునికి అతిదగ్గరగా దూసుకెళ్లింది. చంద్రునికి తృటిలో పెను ముప్పు తప్పిందని సైంటిస్టులు చెబుతున్నారు.

Read Also : SpaceX Rocket : చంద్రుడిని ఢీకొట్టబోతున్న భారీ రాకెట్.. ఏడేళ్ల క్రితమే అదృశ్యమై ట్రాక్‌లోకి..!