Samsung Galaxy A34 Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34పై బిగ్ డిస్కౌంట్.. ఇంతకీ, ఈ ఫోన్ కొనాలా? వద్దా?
Samsung Galaxy A34 Discount : శాంసంగ్ అభిమానులకు అదిరే వార్త.. ఆన్‌లైన్ స్టోర్‌లో గెలాక్సీ A34పై భారీ తగ్గింపును పొందింది. మిడ్-రేంజ్ ఫోన్ ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రూ. 30వేల లోపు ఫోన్ కొనుగోలు చేయడం విలువైనదేనా?

Samsung Galaxy A34 gets big discount on Samsung India website
Samsung Galaxy A34 Discount : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ ఇండియా (Samsung India) అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ కొత్త శాంసంగ్ ఫోన్ AMOLED డిస్‌ప్లే, IP రేటింగ్, స్టీరియో స్పీకర్లు, మరిన్నింటితో వస్తుంది. కానీ, ప్రస్తుతం రూ. 30వేల లోపు శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేయాలా? వద్దా ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ A34పై భారీ డిస్కౌంట్, ధర వివరాలివే :
శాంసంగ్ గెలాక్సీ A34 ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ (Samsung.in)లో రూ. 26,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ 5G ఫోన్ ఇటీవల భారత మార్కెట్లో రూ. 30,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అంటే.. వినియోగదారులు ఈ డివైజ్‌పై రూ. 4వేలు తగ్గింపును పొందవచ్చు. ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన తర్వాత శాంసంగ్ చాలా అరుదుగా ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 స్పెక్స్, ఫీచర్లు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్‌కు సపోర్టుతో పెద్ద 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A34 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 48MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8MP సెకండరీ సెన్సార్, మాక్రో సెన్సార్‌తో 5MP సెన్సార్ ఉన్నాయి.

Samsung Galaxy A34 gets big discount on Samsung India website
ముందు భాగంలో సెల్ఫీల కోసం 13MP సెన్సార్ ఉంది. మీరు హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కూడా పొందవచ్చు. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు IP67 రేటింగ్ కూడా ఉంది. శాంసంగ్ స్టీరియో ఎఫెక్ట్ డ్యూయల్ స్పీకర్లను కూడా ఇచ్చింది. శాంసంగ్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS సపోర్టును 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 డిస్కౌంట్.. కొనడం విలువైనదేనా? :
శాంసంగ్ గెలాక్సీ A34 ఫోన్ దీర్ఘకాలిక ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ కలిగి ఉంది. అయినప్పటికీ, 5G ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ని పొందలేరు. మీ ఇంటి వద్ద ఏదైనా ఛార్జర్‌ని ఉపయోగించవచ్చు. అయితే, ఛార్జింగ్ స్పీడ్ కావాలనుకునే వినియోగదారులు శాంసంగ్ ఛార్జర్‌ని కొనుగోలు చేయాలి. కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టును అందిస్తుంది. గెలాక్సీ A34 కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. వీడియో రికార్డింగ్ బడ్జెట్ ఫోన్ కావాలనుకునే యూజర్లు ఇతర ఆప్షన్లను ఎంచుకోవచ్చు.