Samsung Galaxy A 5G Series : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A54 5జీ, గెలాక్సీ A34 5జీ ఫోన్లపై భారీ తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!

Samsung Galaxy A 5G Series Price Drop : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్లపై భారీ ధర తగ్గింపును పొందవచ్చు.

Samsung Galaxy A 5G Series : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A54 5జీ, గెలాక్సీ A34 5జీ ఫోన్లపై భారీ తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!

Samsung Galaxy A54 5G and Galaxy A34 5G price drops in India

Samsung Galaxy A54 And A34 5G Price Drop : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ రెండు మిడ్-రేంజ్ ఏ సిరీస్ ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్‌లను ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ భారీ ధర తగ్గింపును పొందాయి. ఈ రెండు ఫోన్లలో దేనినైనా తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ రూ.3,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లకు రూ. 2వేల వరకు అదనపు బ్యాంక్ ఆధారిత తగ్గింపు కూడా పొందవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : 10 Strongest Currency List : ప్రపంచంలో అత్యంత 10 బలమైన కరెన్సీల జాబితా ఇదే.. చివరి స్థానంలో డాలర్.. భారత కరెన్సీ ఎక్కడంటే?

భారత్‌లో తగ్గిన గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ ధరలివే :
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ మోడల్.. వాస్తవానికి భారత మార్కెట్లో రూ.30,999కు లాంచ్ అయింది. ఇప్పుడు 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.25,999కి అందుబాటులో ఉంది. ఈ తగ్గిన ధర రూ. 1,500 బ్యాంక్ ఆఫర్, రూ. 3,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కలిగి ఉంది. అదేవిధంగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న యూజర్లు ఇప్పుడు రూ. 27,999 తక్కువ ధర వద్ద పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ54 విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 33,499కి అమ్మకానికి ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 38,999 నుంచి తగ్గింది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పేమెంట్లపై రూ. 3,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, అదనంగా రూ. 2వేలు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ కావాలనుకునే యూజర్లు రూ. 35,499కు పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్‌లు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy A54 5G and Galaxy A34 5G price drops in India

Samsung Galaxy A54 5G and Galaxy A34 5G price drop 

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ : ముఖ్య ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ మోడల్, గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్‌ఫోన్‌లు రెండూ 120హెచ్‌జెడ్ వద్ద రిఫ్రెష్ చేసే ఫుల్-హెచ్డీ+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేలను అందిస్తాయి. ముఖ్యంగా, ఈ డివైజ్‌లు కంపెనీ 4 ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లు ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంటాయి.

కెమెరా విభాగంలో గెలాక్సీ ఏ54 5జీ మోడల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 5ఎంపీ మాక్రో సెన్సార్‌తో వస్తుంది. మరోవైపు, గెలాక్సీ ఏ34 5జీ మోడల్ 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5ఎంపీ మాక్రో సెన్సార్‌తో పాటు ఓఐఎస్‌తో 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు హుడ్ కింద 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో పవర్ అందిస్తాయి.

Read Also : Poco X6 Pro on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 24,999 ధరకే పోకో X6 ప్రో సొంతం చేసుకోండి.. ఈ ఫోన్ ఎందుకు కొనాలి? 4 కారణాలివే!