Samsung Galaxy F56 5G : ఇది కదా ఫోన్ అంటే.. కిర్రాక్ ఫీచర్లతో కొత్త శాంసంగ్ గెలాక్సీ F56 5G ఫోన్.. కొనడమే ఆలస్యం..!

Samsung Galaxy F56 5G : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం గెలాక్సీ F56 5G ఫోన్ రిలీజ్ అయింది. ఈ 5G ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, ఫీచర్లు వివరాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F56 5G : ఇది కదా ఫోన్ అంటే.. కిర్రాక్ ఫీచర్లతో కొత్త శాంసంగ్ గెలాక్సీ F56 5G ఫోన్.. కొనడమే ఆలస్యం..!

Samsung Galaxy F56 5G

Updated On : May 8, 2025 / 6:17 PM IST

Samsung Galaxy F56 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. శాంసంగ్ అధికారికంగా గెలాక్సీ F56 5G  (Samsung Galaxy F56 5G) లాంచ్ చేసింది.

కొత్తగా రిలీజ్ అయిన ఈ ఫోన్ 7.2mm మందంతో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. గెలాక్సీ F55 5G కన్నా అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చింది.

Read Also : Moto G86 5G Launch : ఓ కన్నేసి ఉంచండి.. మోటో G86 5G ఫోన్ వస్తోంది.. ఇండియాకు ఎప్పుడైనా రావొచ్చు.. ఫీచర్లు, ధరపై అంచనాలివే..!

ఈ ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, అమోల్డ్ డిస్‌ప్లే, ఇన్-హౌస్ Exynos చిప్‌సెట్‌తో పాటు భారీ బ్యాటరీని అందిస్తుంది.

అదనంగా, శాంసంగ్ 6 ఏళ్ల OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందించనుంది. ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు సహా గెలాక్సీ F56 5G ఫోన్ వివరాలను ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ F56 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ F56 5G ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

హుడ్ కింద, ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 1480 ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

ఏఐ-ఆధారిత ఎడిటింగ్ టూల్స్ (ఆబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్), 2X జూమ్‌తో పోర్ట్రెయిట్ 2.0, 4K 30 FPS వీడియో రికార్డింగ్ (10-బిట్ HDR), ట్యాప్ అండ్ పే (శామ్‌సంగ్ వాలెట్) కూడా అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP OIS ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రావైడ్, 50MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ F56 5G ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ F56 5G ధర రూ.25,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 8GB, 128GB వేరియంట్‌కు రూ.2వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. టాప్ ఎండ్ 8GB, 256GB వేరియంట్ ధర రూ.28,999కు పొందవచ్చు.

Read Also : Apple iPhone 16 Plus : ఆఫర్ అదిరింది భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్.. మీ బడ్జెట్ ధరలో ఇలా కొనేసుకోండి!

ఇందులో రూ.2వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. కస్టమర్లు గ్రీన్, వైలెట్ కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. కస్టమర్లు నెలకు రూ.1,556 నుంచి EMI ఆప్షన్లను ఎంచుకోవచ్చు.