Samsung Galaxy M17 : పండగ చేస్కోండి.. కొత్త శాంసంగ్ గెలాక్సీ M17 వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా తక్కువే!
Samsung Galaxy M17 : శాంసంగ్ గెలాక్సీ M17 లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP OIS కెమెరా, ఏఐ ఫీచర్లతో పాటు ట్రిపుల్ రియర్ సెటప్ కలిగి ఉంది.

Samsung Galaxy M17
Samsung Galaxy M17 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియా అధికారికంగా శాంసంగ్ గెలాక్సీ M17 లాంచ్ చేసింది. పాపులర్ శాంసంగ్ గెలాక్సీ M లైనప్‌ను విస్తరించింది. ఈ గెలాక్సీ M16 ఫోన్ కొత్త మోడల్ 50MP, ఓఎఐఎస్ కెమెరా, ఏఐ ఫీచర్లు అనేక అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.
వన్ యూఐ7తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. ఈ ఫోన్, జెమిని లైవ్, సర్కిల్ టు సెర్చ్‌తో సహా అనేక ఏఐ ఫీచర్‌లను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ M17 ధర, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు, లభ్యత, లాంచ్ ఆఫర్‌లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ M17 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎం17 ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. శాంసంగ్ వన్ యూఐ7తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఫుల్-HD ప్లస్ రిజల్యూషన్ (1,080×2,340 పిక్సెల్స్), 1,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ప్రొటెక్షన్ కోసం శాంసంగ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ట్రిపుల్ రియర్ సెటప్ కూడా కలిగి ఉంది.
ఇందులో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 13MP ఫ్రంట్ కెమెరా టియర్‌డ్రాప్ నాచ్‌లో వస్తుంది. శాంసంగ్ 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, 6 OS అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. దాంతో పాటు, వినియోగదారులు సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్, జెమిని లైవ్‌తో సహా ఏఐ ఆధారిత ఫీచర్లకు యాక్సస్ పొందుతారు. కస్టమర్లు మూన్‌లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ M17 ధర, ఆఫర్లు :
శాంసంగ్ బేస్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 6GB, 8GB ర్యామ్ మోడళ్ల ధర వరుసగా రూ.13,999, రూ.15,499కు అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్ ప్రకారం.. కొనుగోలుదారులు ఈ వేరియంట్‌లను కూడా తగ్గింపు ధరకు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 13 నుంచి అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.