RC 17 : సుకుమార్ – రామ్ చరణ్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పట్నించి అంటే..?
తాజాగా సుకుమార్ - రామ్ చరణ్ సినిమా గురించి టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తుంది. (RC 17)

RC 17
RC 17 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2026 మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా చేస్తున్నారు అని RC17 గతంలోనే ప్రకటించారు.(RC 17)
తాజాగా సుకుమార్ – రామ్ చరణ్ సినిమా గురించి టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తుంది. సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేసేశాడని, ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో మొదలుపెడతారని తెలుస్తుంది. పెద్ది పూర్తిగా అయ్యాక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ మొదలవుతుందని, ఫిబ్రవరిలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేస్తారని టాక్ నడుస్తుంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Vijay Deverakonda : సైలెంట్ గా విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్.. కీర్తి సురేష్ ఫిక్స్..
అలాగే సంక్రాంతికి ఈ సినిమా ఓపెనింగ్ జరుగుతుందని కూడా వినిపిస్తుంది. గతంలో సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరణ్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు రాబోయే RC17 సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.