Samsung Galaxy S23 Series Price : ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ఏకంగా రూ.10వేలు తగ్గింపు.. గెలాక్సీ S24 కోసం ఆగాలా? వద్దా?

Samsung Galaxy S23 Series Price : శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ ఈవెంట్‌కు ముందుగానే శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్ భారీ ధర తగ్గింపులను అందుకున్నాయి. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy S23 Series Price : ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ఏకంగా రూ.10వేలు తగ్గింపు.. గెలాక్సీ S24 కోసం ఆగాలా? వద్దా?

Samsung Galaxy S23, S23 Plus price drops by Rs 10k

Updated On : January 7, 2024 / 6:32 PM IST

Samsung Galaxy S23 Series Price : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ ఈవెంట్‌కు ఒక వారం ముందు శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్ భారీ ధర తగ్గింపులను అందుకున్నాయి. గత ఏడాది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ కూడా అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. కానీ, ఈ తగ్గింపులన్నీ కూడా ఒక ఏడాది నాటి ఫ్లాగ్‌షిప్‌లకు మాత్రమే వర్తించనున్నాయి. రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మోడల్‌ కోసం వేచి ఉండాలా? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Samsung Galaxy A Series 5G : హై-ఎండ్ ఫీచర్లతో శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోన్లు.. ధర కేవలం రూ.19,499 మాత్రమే!

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 భారత్ మార్కెట్లో జనవరి 17 లాంచ్‌ కానుంది. అంతకంటే ముందు శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్, అల్ట్రా మోడల్ ధర రూ. 10వేలు తగ్గింది. 128జీబీ స్టోరేజీ ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

అయితే, 256జీబీ వేరియంట్ రూ. 69,999కి విక్రయిస్తోంది. అదేవిధంగా, గెలాక్సీ ఎస్23 ప్లస్ 256 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 84,999కు పొందవచ్చు. అసలు ధర రూ. 94,999 నుంచి భారీ తగ్గింపు పొందవచ్చు. అదనంగా, 512జీబీ వేరియంట్ ఇప్పుడు రూ.94,999కు కొనుగోలు చేయొచ్చు.

Samsung Galaxy S23, S23 Plus price drops by Rs 10k

Samsung Galaxy S23, S23 Plus price

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా తగ్గింపు :
గత ఏడాదిలో అల్ట్రా మోడల్ భారత మార్కెట్లో రూ. 1,24,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అంటే.. వినియోగదారులు రూ. 27,750 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై అదనపు ఆఫర్ కూడా పొందవచ్చు. తద్వారా ధరపై 10 శాతం తగ్గింపు అందిస్తుంది.

గెలాక్సీ ఎస్23 సిరీస్ కొనాలా? గెలాక్సీ S24 కోసం వేచి ఉండాలా? :
వాస్తవానికి యూజర్ అవసరాలపైనే కొత్త ఫోన్ కొనాలా? లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మంచి కెమెరా, ఇతర ఫీచర్లతో వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే గతేడాది మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ మోడల్‌ని కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. గెలాక్సీ ఎస్23 కన్నా వేగవంతమైన ఛార్జింగ్, భారీ బ్యాటరీతో పాటు పెద్ద స్క్రీన్‌ను అందిస్తుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి, డివైజ్ త్వరగా ఛార్జ్ కావాలనుకునే వారికి ఈ ఫీచర్‌లు చాలా అవసరమని చెప్పవచ్చు.

మీకు డబ్బు సమస్య కాకపోతే.. కొత్త వెర్షన్‌లు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ కోసం కొన్ని అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు. గెలాక్సీ ఎస్24 సిరీస్ కోసం వేచి ఉండాలి. కొత్త గెలాక్సీ ఎస్24 సిరీస్ దేశంలో లాంచ్ అయ్యే సమయానికి పాత మోడళ్ల ధరలు తగ్గకుండా ఉంటే ఈ ఫోన్ వెంటనే కొనేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Series : 2024లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వస్తోంది.. లాంచ్‌‌కు ముందే ధర వివరాలు లీక్