Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ముందే తెలిసిందోచ్..!
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ రివీల్ చేసింది. ఊహించిన దాని కన్నా ముందుగానే గెలాక్సీ సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 Series Launch Date Tipped Again; Said to Debut Earlier Than Expected
Samsung Galaxy S24 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung Galaxy S24 Series) త్వరలో లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ S23 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ల తర్వాత శాంసంగ్ రాబోయే ఫ్లాగ్‌షిప్ సిరీస్ గురించి ఇప్పటికే ఊహాగానాలు, పుకార్లు ప్రారంభమయ్యాయి.
గత లైనప్‌ల మాదిరిగానే కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 3 మోడళ్లను కలిగి ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బేస్ గెలాక్సీ S24, గెలాక్సీ S24+, గెలాక్సీ S24 అల్ట్రా మోడల్స్ ఉన్నాయి. ఈ శాంసంగ్ మోడల్‌ల ముఖ్య ఫీచర్లను అనేక లీక్‌లు సూచిస్తున్నాయి. రాబోయే శాంసంగ్ లైనప్ ఊహించిన దానికన్నా త్వరగా లాంచ్ చేయొచ్చునని కొత్త నివేదిక సూచిస్తుంది.
ఆపిల్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ లైనప్ :
గెలాక్సీ S24 సిరీస్‌ను జనవరి 17న అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమంలో లాంచ్ చేయనున్నట్లు ఎస్‌ఈఎస్ బిజ్ రిపోర్టు పేర్కొంది. జనవరి ప్రారంభంలో మధ్యలో సిరీస్‌ను ఎక్కడో ప్రారంభించిన శాంసంగ్ గెలాక్సీ S24ని సాధారణం కన్నా ముందుగానే లాంచ్ చేయాలని చూస్తోందని నివేదిక సూచిస్తుంది.

Samsung Galaxy S24 Series Launch Date Tipped Again
ఎందుకంటే.. సెమీకండక్టర్ వ్యాపారంలో ఊహించిన దానికన్నా తక్కువ పనితీరుతో ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను అందిస్తుంది. అయితే, జూలై 26న సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ తర్వాత శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5 సేల్స్ అందుబాటులో ఉన్నాయి. గత సెప్టెంబరులో ఐఫోన్ 15 సిరీస్‌ను ఆవిష్కరించిన పోటీదారు ఆపిల్‌తో పోటీగా శాంసంగ్ తమ లైనప్ తీసుకురానుంది.
ముఖ్యంగా, గెలాక్సీ S23 సిరీస్ ఈ ఏడాదిలో ఫిబ్రవరి 17న లాంచ్ అయింది. అయితే, సౌత్ కొరియా టెక్ దిగ్గజం గెలాక్సీ S22 ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను ఫిబ్రవరి 10, 2022న తీసుకొచ్చింది. త్వరలో గెలాక్సీ S24 లైనప్‌ను కూడా పొందవచ్చు. నివేదిక ప్రకారం.. గెలాక్సీ S23 SE మోడల్ దక్షిణ కొరియాలో డిసెంబర్ 1న KRW 800,000 ధరకు లాంచ్ చేయనుంది. దేశంలో సాధారణ ఆర్థిక మాంద్యం కారణంగా తగ్గిన గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‌ల అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తోంది. మిడ్-రేంజ్ ఫ్యాన్ ఎడిషన్ మోడల్ అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.