Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈ‌వెంట్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఎల్టీపీఓ స్క్రీన్‌ కలిగి ఉంటుంది.

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈ‌వెంట్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Samsung Galaxy S25 Ultra

Updated On : January 9, 2025 / 6:04 PM IST

Samsung Galaxy S25 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ ఎస్ సిరీస్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ (జనవరి) 22న రాబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌లో ఆవిష్కరించనుంది. అధికారిక లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా మోడల్ ముఖ్య స్పెసిఫికేషన్‌లను టిప్‌స్టర్ సూచించింది.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!

సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా అందిస్తుందని నివేదించింది. ఇప్పటికే ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ మాదిరిగానే కొత్త మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఎల్టీపీఓ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మునుపటి కన్నా కొంచెం ఎక్కువ వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్‌తో వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు (లీక్) :
విన్‌ఫ్యూచర్ రోనాల్డ్ క్వాన్డిట్ బ్లూస్కీలో గెలాక్సీ ఎస్24 అల్ట్రా సక్సెసర్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. పోస్ట్ ప్రకారం.. రాబోయే హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్టుతో డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 2600నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.

3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని 12జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ, 16జీబీ+1టీబీ వెర్షన్లలో 45డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌తో పాటు 25డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ అందించే 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్ కన్నా అప్‌గ్రేడ్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ 162.8×77.6×8.2ఎమ్ఎమ్ కొలవగలదు. ఫోన్ 219 గ్రాముల బరువు ఉంటుంది. గత ఏడాదిలో మోడల్ 162.3×79.0×8.6ఎమ్ఎమ్, 232 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy S25 Ultra

Samsung Galaxy S25 Ultra

శాంసంగ్ నెక్స్ట్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ప్రకటన :
శాంసంగ్ జనవరి 22న శాన్ జోస్‌లో అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్‌ల కోసం ముందస్తు రిజర్వేషన్‌లు ఇప్పటికే భారత మార్కెట్లో ప్రారంభమయ్యాయి. శాంసంగ్ విడుదల చేసిన టీజర్ నాలుగు ఫోన్లలో ప్రదర్శిస్తుంది. లాంచ్ ఈవెంట్ సందర్భంగా 4 గెలాక్సీ S25 మోడళ్లను విడుదల చేయనున్నట్లు సూచిస్తుంది. ఈ సందేహాస్పద హ్యాండ్‌సెట్‌లు శాంసంగ్ గెలాక్సీ S25, గెలాక్సీ ఎస్25+, గెలాక్సీ ఎస్25 అల్ట్రా, కొత్త గెలాక్సీ ఎస్25 స్లిమ్ మోడల్‌గా ఉండే అవకాశం ఉంది.

అయితే, శాంసంగ్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌ల పేర్లను ప్రకటించలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా మోడల్ 3 ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ షేడ్స్‌తో సహా 7 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని పుకారు ఉంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరా, 10ఎంపీ 3ఎక్స్ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, అప్‌గ్రేడ్ చేసిన 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Read Also : Vivo T3X Price Cut : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వివో T3x 5జీ ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. కొత్త ధర ఎంతంటే?