సుదూర గెలాక్సీలో మాయమైన సూపర్ బ్లాక్ హోల్.. మన పాలపుంతనే దాచేసిందా?

Supermassive black hole distant galaxy missing : సుదూర గెలాక్సీ మధ్యలో ఉండాల్సిన అత్యంత శక్తివంతమైన బ్లాక్ హోల్ అదృశ్యమైపోయింది. ఈ సూపర్ బ్లాక్ హోల్ ఎక్కడికి మాయమైపోయిందో అర్థం కాక సైంటిస్టులు తలలు పట్టేసుకున్నారు. ప్రకాశవంతమైన క్లస్టర్ గెలాక్సీ A2261-BCG నుంచి సూపర్ బ్లాక్ హోల్ మాయమైపోయినట్టు కనిపిస్తోంది. మాయమైన బ్లాక్ హోల్.. ఇప్పుడు అంతరిక్షంలో తేలియాడుతూ ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రీకాయిలింగ్.. అంటే గెలాక్సీలోని శక్తివంతమైన సూపర్ బ్లాక్ హోల్ ఎక్కడో దూరంగా వెళ్లిపోయి ఉండొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మిస్టరీ స్పేస్ బ్లాక్ హోల్‌ను ఉత్తర అమెరికాలోని కొన్ని యూనివర్శిటీల పరిశోధకులు గుర్తించారు. యూనివర్స్‌లో మన పాలపుంతతో సహా దాని మధ్యలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నట్లు భావిస్తున్నారు. మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ కహాన్ గుల్టెకిన్ నేతృత్వంలోని బృందం అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్‌లో బ్లాక్ హోల్స్ తిరిగి పొందడంపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
గెలాక్సీ A2261-BCGను అధ్యయనం చేస్తున్న సమయంలో బ్లాక్ హోల్ అదృశ్యమైనట్టు సంకేతాలను గమనించినట్టు డాక్టర్ గుల్టెకిన్ పేర్కొన్నారు. బ్లాక్ హోల్ మిస్సింగ్ కావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. అదృశ్యమైన బ్లాక్ హోల్ ఇప్పటికీ గెలాక్సీలోనే ఎక్కడో చోట దాక్కొని ఉండొచ్చునని అంటున్నారు. మాయమైన బ్లాక్ హోల్ జాడను గుర్తించడం కష్టమేనని చెబుతున్నారు.
లేదంటే మరో బ్లాక్ హోల్ మింగేసిందా? రెండు బ్లాక్ హోల్ ఢీకొని ఉండొచ్చునని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. సూపర్ బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి విలీనం కావడం సైంటిస్టులు ఎప్పుడూ గమనించలేదని అంటున్నారు. ఈ గెలాక్సీ మిస్టరీపై మరింత పరిశోధనలు చేసేందుకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎలా ఫోకస్ చేస్తాయనేది చూడాలంటున్నారు.