Suzuki Hayabusa Bike : సరికొత్త సుజుకి హయబుసా బైక్ వచ్చేసిందోచ్.. 25వ యానివర్శరీ సెలబ్రేషన్ ఎడిషన్ ధర ఎంతంటే?

Suzuki Hayabusa Bike : సుజుకి నుంచి సరికొత్త హయబుసా బైక్ వచ్చేసిందోచ్.. 25వ యానివర్శరీ సెలబ్రేషన్ మోటార్‌సైకిల్ ఎడిషన్ ఫీచర్లు, ధర ఎంతంటే?

Suzuki Hayabusa Bike : సరికొత్త సుజుకి హయబుసా బైక్ వచ్చేసిందోచ్.. 25వ యానివర్శరీ సెలబ్రేషన్ ఎడిషన్ ధర ఎంతంటే?

Suzuki Hayabusa 25th Anniversary Celebration Edition launched

Suzuki Hayabusa Bike : ప్రముఖ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సుజుకి హయబుసా 25వ యానివర్శరీ సెలబ్రేషన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 17.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. 1998లో జర్మనీలోని ఇంటర్‌మోట్‌లో సుజుకి హయాబుసా జీఎస్ఎక్స్1300ఆర్ మోడల్‌గా ఆవిష్కరించింది. ఈ లెజెండరీ మోటార్‌సైకిల్ విక్రయాలు 1999లో ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లో ప్రొడక్టు, సేల్స్ 2016లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న థర్డ్ జనరేషన్ మోడల్ 2021లో మార్కెట్‌లోకి ప్రవేశించింది.

Read Also : Mahindra Bolero Neo Plus : 9-సీటర్ కెపాసిటీతో కొత్త మహీంద్రా బొలెరో నియో ప్లస్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

మోటార్‌సైకిల్‌లో ప్రస్తుత మూడో జనరేషన్ హయాబుసా మాదిరిగా అదే 1,340సీసీ ఇన్-లైన్ 4-సిలిండర్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ లిక్విడ్-కూల్డ్ డీఓహెచ్‌సీ ఇంజన్‌ని ఉపయోగించారు. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లు, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్‌లతో సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (SIRS)తో అమర్చింది.

ఆరెంజ్, బ్లాక్-బేస్డ్ బాడీని కలిగిన హయబుసా 25వ వార్షికోత్సవ ఎడిషన్‌లో గోల్డ్ యానోడైజ్డ్ డ్రైవ్ చైన్ అడ్జస్టర్, ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఇన్నర్, మఫ్లర్ బాడీ, డ్రైవ్ చైన్‌పై ఒరిజినల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్యాంక్‌పై 25వ వార్షికోత్సవ ఐకాన్, ట్రి డైమన్షనల్ సుజుకి లోగో ఉన్నాయి. సింగిల్ సీట్ కౌలింగ్ ఇప్పుడు ఈ సెలబ్రేటరీ ఎడిషన్‌లో స్టాండర్డ్ ఈక్వెమెంట్‌గా వస్తుంది.

సుజుకి హయాబుసా 25ఏళ్లకు పైగా స్పీడ్, డిజైన్ పరంగా ఐకాన్‌గా నిలిచింది. 25వ వార్షికోత్సవ సెలబ్రేషన్ ఎడిషన్‌ లాంచ్ సందర్భంగా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని స్మరించుకుంటామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైడర్‌లతో మోటార్‌సైకిళ్లను అందించడంలో సంవత్సరాలుగా ఈ మోటార్‌సైకిల్ విజయానికి ఆజ్యం పోసిందన్నారు. మా కస్టమర్‌లు నిరంతర ప్రేమ, మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కెనిచి ఉమెడ పేర్కొన్నారు. సుజుకి హయబుసా 25వ యానివర్శిసరీ మోడల్ ఇప్పుడు భారత సుజుకి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

Read Also : OnePlus 11R Launch : వన్‌ప్లస్ సరికొత్త 11ఆర్ సోలార్ రెడ్ ఎడిషన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?