Tech Tips in Telugu : పేటీఎం, పోన్‌పే వ్యాలెట్ నుంచి నగదును బ్యాంకు అకౌంట్లకు ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ టిప్స్..!
Tech Tips in Telugu : డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే, భారత్‌లో రెండు పాపులర్ డిజిటల్ వ్యాలెట్ సర్వీసులైన పేటీఎం (Paytm), పోన్‌పే (PhonePe) వ్యాలెట్ల నుంచి నగదును మీ బ్యాంకు అకౌంట్లకు ఎలా పంపుకోవాలో తెలుసా?

How to Transfer Paytm And PhonePe Wallet Money to Bank Account in few Simple Steps
Tech Tips in Telugu : డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే, భారత్‌లో రెండు పాపులర్ డిజిటల్ వ్యాలెట్ సర్వీసులైన పేటీఎం (Paytm), పోన్‌పే (PhonePe) వ్యాలెట్ల నుంచి నగదును మీ బ్యాంకు అకౌంట్లకు ఎలా పంపుకోవాలో తెలుసా? సాధారణంగా చాలామంది వినియోగదారులు తమ డిజిటల్ యాప్ వ్యాలెట్లో లోడ్ చేసిన నగదును బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని భావిస్తుంటారు.
అందుకు ఈ రెండు డిజిటల్ యాప్స్ బాగా ఉపయోగపడతాయి. సురక్షితమైన, అవాంతరాలు లేని పేమెంట్లను చేసుకునేందుకు పేటీఎం, పోన్‌పే వినియోగదారులను అనుమతిస్తాయి. ఈ వ్యాలెట్ల సౌలభ్యంతో వినియోగదారులు కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల తమ డిజిటల్ వ్యాలెట్ నుంచి వారి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బును బదిలీ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా మీ Paytm, PhonePe వ్యాలెట్ డబ్బును బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయాలనుకుంటే.. ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.
Paytm వ్యాలెట్ నగదును బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే?
– మీ మొబైల్ ఫోన్‌లో Paytm యాప్‌ని ఓపెన్ చేయండి.
– ‘My Pay’ సెక్షన్ కిందికి స్క్రోల్ చేయండి.
– ‘Paytm Wallet‘పై Click చేయండి.
– ఇప్పుడు, ‘Transfer to Bank‘ ఆప్షన్ ఎంచుకోండి.
– మీరు బదిలీ చేసే మొత్తాన్ని నమోదు చేసి, ‘Transfer‘ బటన్‌పై Click చేయండి.
– మీరు డబ్బును బదిలీ చేయాలనుకునే బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్, అకౌంట్ పేరు వంటి మీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయండి.
– మీరు ఇంతకు ముందు మీ వ్యాలెట్ నుంచి బ్యాంక్ అకౌంటుకు డబ్బు పంపినట్లయితే.. మీరు సేవ్ చేసిన అకౌంట్లపై కూడా Tap చేయొచ్చు.
– వివరాలను వెరిఫై చేసిన తర్వాత, ‘Proceed‘ బటన్‌పై Click చేయండి.
– ‘Confirm‘ బటన్‌పై Click చేయండి.
– Paytm ఆ తర్వాత లావాదేవీని ప్రాసెస్ చేస్తుంది.
– నగదు సక్సెస్‌ఫుల్‌గా బదిలీ అయిందని సూచిస్తూ మీ స్క్రీన్‌పై మీకు Confirmation మెసేజ్ వస్తుంది.
ముఖ్యంగా, Paytm UPI పేమెంట్ సిస్టమ్‌కు లావాదేవీలు చేసేందుకు వినియోగదారులకు KYC వెరిఫికేషన్ అవసరం లేదు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. పేటీఎం వ్యాలెట్ KYC వెరిఫికేషన్ అవసరం. నిబంధనల ప్రకారం.. వినియోగదారులు రూ. కనీస KYCతో రూ. 10వేలు, ఫుల్ KYCతో రూ. 1 లక్ష వరకు పంపుకోవచ్చు.

How to Transfer Paytm And PhonePe Wallet Money to Bank Account
PhonePe వ్యాలెట్ డబ్బును బ్యాంక్ అకౌంటుకు ఇలా బదిలీ చేయండి :
– మీ స్మార్ట్‌ఫోన్‌లో PhonePe యాప్‌ని ఓపెన్ చేయండి.
– ఆ తర్వాత, స్క్రీన్ దిగువన ఉన్న ‘My Pay’ ఆప్షన్‌పై Tap చేయండి.
– స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న ఆప్షన్ల లిస్టు నుంచి ‘Wallet/Gifts Vocher’ సెక్షన్ ఎంచుకోండి.
– Menu నుంచి ‘PhonePe Wallet’ ఆప్షన్ ఎంచుకోండి.
– మీరు PhonePe Wallet సెక్షన్‌లో వచ్చిన తర్వాత, స్క్రీన్ పైభాగంలో ఉన్న ‘Withdrawal’ ట్యాబ్ కోసం సెర్చ్ చేసి దానిపై నొక్కండి.
– మీరు స్క్రీన్‌పై వ్యాలెట్ ఐకాన్, బ్యాంక్ ఐకాన్ చూడవచ్చు.
– మీ PhonePe వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బును బదిలీ చేసేందుకు.. వ్యాలెట్ ఐకాన్ పైకి బ్యాంక్ ఐకాన్ కిందికి లాగండి.
– మీరు మీ PhonePe వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేసే మొత్తాన్ని ఎంటర్ చేసి, ‘Proceed’ బటన్‌పై నొక్కండి.
– మీరు ఇప్పటికే మీ బ్యాంక్ అకౌంటును మీ PhonePe అకౌంట్‌కు లింక్ చేయకుంటే.. ఈ దశలో అలా చేయమని మీకు Prompt కనిపిస్తుంది.
– PhonePeకి మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వండి.
– మీరు మీ బ్యాంక్ అకౌంట్ విజయవంతంగా లింక్ చేసిన తర్వాత.. డబ్బు వెంటనే మీ బ్యాంక్ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
ముఖ్యంగా, మీరు UPI లేదా క్రెడిట్/డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి PhonePe యాప్‌లో నేరుగా చెల్లింపు చేస్తే.. మీరు KYC (Know Your Customer) వెరిఫికేషన్ ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే, మీరు PhonePe Wallet ఫీచర్‌ని ఉపయోగించాలనుకుంటే.. మీరు RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలకు అనుగుణంగా KYC ప్రాసెస్ పూర్తి చేయాలి.
మీ పాస్‌పోర్ట్, NREGA జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా PAN కార్డ్ వంటి కనీసం ఒక ప్రభుత్వం జారీ చేసిన ID వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, నగదును బదిలీ చేసేందుకు మీరు తప్పనిసరిగా PhonePeలో పేమెంట్ మెథడ్ యాడ్ చేసుకోవాలి. అదనంగా, మీ PhonePe వ్యాలెట్‌లో ఏదైనా రివార్డ్ బ్యాలెన్స్ ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకులోకి విత్‌డ్రా చేసుకోలేరని గమనించాలి.