Google Hiring : రెండు వారాల పాటు నియామకాలు నిలిపేసిన గూగుల్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రెండు వారాల పాటు నియామకాలను నిలిపివేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే గూగుల్ ఏకంగా 10వేల మందిని నియమించుకుంది.

Technology Google Annouces 2 Week Hiring Freeze, Review Headcount Needs
Google Hiring : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రెండు వారాల పాటు నియామకాలను నిలిపివేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే గూగుల్ ఏకంగా 10వేల మందిని నియమించుకుంది. ఈ ఏడాది రాబోయే క్వార్టర్లలో నియామకాల ప్రక్రియ మందకొడిగా సాగుతుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కొద్దిరోజులకే హైరింగ్ ప్రక్రియ నిలిపివేతపై గూగుల్ నిర్ణయం తీసుకుంది.
హైరింగ్ ప్రక్రియ నెమ్మదించిన కీలక రోల్స్‌లో ఇంజనీర్లు, ఉద్యోగుల హైరింగ్ పునరుద్ధరిస్తామని ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో పిచాయ్ తెలిపారు. గూగుల్ రెండు వారాల పాటు హైరింగ్ ప్రక్రియ నిలిపివేయనుంది. అదే సమయంలో హెడ్‌కౌంట్ అవసరాలు, రాబోయే మూడు నెలల్లో ఏయే విభాగాల్లో సిబ్బంది అవసరం ఉందో అంశాలను మదింపు చేస్తామని గూగుల్ పేర్కొంది.

Technology Google Annouces 2 Week Hiring Freeze, Review Headcount Needs
ఇప్పటికే ఆఫర్లు అందుకున్న అభ్యర్ధులపై హైరింగ్ ప్రక్రియ నిలిపివేత ప్రభావం ఉండకపోవచ్చు. అలాగే కాంట్రాక్టు పొడిగింపును కోరే ఉద్యోగులకు ఇబ్బందికరమేనని చెబుతున్నారు. గత ఏడాది చివరి క్వార్టర్‌తో పాటు ప్రస్తుత క్వార్టర్‌లో వార్షిక టార్గెట్‌ను అధిగమించిన క్రమంలో హైరింగ్ ప్రక్రియను నెమ్మదించినట్టు గూగుల్ వెల్లడించింది.
Read Also : Google Play Store : గూగుల్ ప్లే స్టోర్ నుంచి 50 యాప్స్ తొలగింపు.. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే తీసేయండి!