2025లో అత్యంత ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ ఉన్న టాప్‌ 3 ఫోన్లు ఇవే.. కళ్లుచెదిరే ఫీచర్లతో..

మిడ్‌ రేంజ్‌లో వన్‌ప్లస్‌ బ్రాండ్‌ నుంచి మంచి బ్యాటరీ బ్యాకప్‌ కావాలనుకుంటే వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ5 5జీ ఫోన్‌ సరైనది.

2025లో అత్యంత ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ ఉన్న టాప్‌ 3 ఫోన్లు ఇవే.. కళ్లుచెదిరే ఫీచర్లతో..

Updated On : August 11, 2025 / 10:30 AM IST

స్మార్ట్‌ఫోన్‌ను మళ్లీ మళ్లీ ఛార్జ్‌ చేయడం చాలా విసుగుగా అనిపిస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటే అత్యధిక బ్యాటరీ లైఫ్‌ ఉన్న ఫోన్‌ను కొనాలి. ఈ ఏడాది విడుదలైన ఇటువంటి టాప్‌-3 స్మార్ట్‌ఫోన్ల లిస్టును చూద్దాం. వీటిని ఛార్జ్‌ చేయడానికి క్విక్‌ ఛార్జింగ్‌ ఆప్షన్స్‌ కూడా ఉంటాయి. ఈ ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు తెలుసుకుందాం.

ఐక్యూ జే10
ఐక్యూ జే10 ఫోన్‌లో 7300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది సాధారణ వాడకంతో 2 రోజులు సులభంగా పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్‌ చేయడానికి కంపెనీ 90వాట్ల ఫాస్ట్‌ ఛార్జర్‌ ఇస్తుంది. 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 3 చిప్‌సెట్‌ లభిస్తుంది. హెవీ టాస్క్స్‌ సులభంగా చేయవచ్చు. భారత మార్కెట్లో ధర 21,998 రూపాయలు, మంచి డిస్కౌంట్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ లేదా అమెజాన్‌ వెబ్‌సైట్స్‌ చూడండి.

Also Read: రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ

రియల్‌మీ జీటీ 7 డ్రీమ్‌ ఎడిషన్‌
రియల్‌మీ జీటీ 7 డ్రీమ్‌ ఎడిషన్‌ గేమర్లకు మంచి ఆప్షన్. ఇందులో 7000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ, 120వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంటుంది, ఇది 1 గంటలో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్‌ చేస్తుంది. 6.78 అంగుళాల ఎల్టిపియో అమోలెడ్‌ డిస్ప్లే, 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ లభిస్తుంది. పెర్ఫార్మెన్స్‌ కోసం డైమెన్సిటీ 9400ఇ ప్రాసెసర్‌ ఇస్తారు. ధర 49,999 రూపాయలు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ5 5జీ
మిడ్‌ రేంజ్‌లో వన్‌ప్లస్‌ బ్రాండ్‌ నుంచి మంచి బ్యాటరీ బ్యాకప్‌ కావాలనుకుంటే ఈ ఫోన్‌ సరైనది. ఇందులో 7100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఛార్జ్‌ చేయడానికి కంపెనీ 80వాట్ల సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇస్తుంది. గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ ఉంది. ధర 27,999 రూపాయలు.