Top Deals on Laptops : అమెజాన్‌లో డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్ల కోసం టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Top Deals on Laptops : అమెజాన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ముందుగానే ప్రైమ్ మెంబర్ల కోసం టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్ అందిస్తోంది..

Top Deals on Laptops : అమెజాన్‌లో డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్ల కోసం టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Top Deals on Laptops

Updated On : September 22, 2025 / 3:59 PM IST

Top Deals on Laptops : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ఇండియా పండుగ సీజన్ సేల్ మొదలైంది. ప్రత్యేకించి ప్రైమ్ సభ్యుల కోసం అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లతో సహా వైడ్ రేంజ్ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రీమియం డివైజ్‌ల నుంచి విద్యార్థులు, ప్రొఫెషనర్లకు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్ ప్రతిఒక్కరికి ఆకర్షణీయమైన డీల్స్  (Top Deals on Laptops) అందిస్తుంది. మీరు కొత్త ల్యాప్‌టాప్‌కి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సందర్భంగా అనేక బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై కొన్ని బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ల్యాప్‌టాప్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

1. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 :

ఆపిల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్. మ్యాక్‌బుక్ ఎయిర్ M4 అసలు ధర రూ.99,900 నుంచి రూ.83,990కి తగ్గింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ.4,500 తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుత ధర రూ.82,240కి తగ్గుతుంది. పాత ల్యాప్‌టాప్ కోసం అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా వినియోగదారులు రూ.7,650 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.

ఆపిల్ యొక్క M4 చిప్ ద్వారా ఆధారితమైన ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ రోజువారీ పనులు, సృజనాత్మక పని మరియు తేలికపాటి ప్రొఫెషనల్ పనిభారాలకు అసాధారణమైన పనితీరును అందిస్తుంది. దీని ఫ్యాన్‌లెస్ డిజైన్ నిశ్శబ్ద ఆపరేషన్‌ను నిర్ధారిస్తుంది, అయితే 13.6-అంగుళాల రెటినా డిస్ప్లే పదునైన విజువల్స్ మరియు శక్తివంతమైన రంగులను అందిస్తుంది. 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌తో, పనితీరుపై రాజీ పడకుండా పోర్టబిలిటీ అవసరమైన వారికి ఇది ఒక ఆదర్శవంతమైన ఎంపిక.

2. ఆసుస్ వివోబుక్ 16 :
అసూస్ వివోబుక్ 16 అనేది అమెజాన్‌లో మరో అద్భుతమైన డీల్. ఆల్ రౌండర్ యూజర్ల కోసం ఈ ల్యాప్‌టాప్ రూపొందించింది. పర్ఫార్మెన్స్, స్టయిల్ కలిగి ఉంది. లేటెస్ట్ ఇంటెల్ ప్రాసెసర్‌లు, ర్యామ్, పవర్‌ఫుల్ 16-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. వివోబుక్ X16 డివైజ్ విద్యార్థులు, ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్లకు అద్భుతంగా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా కొత్త ల్యాప్‌టాప్ కొనాలని అనుకునేవారికి అద్భుతమైన ఆప్షన్. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ రూ. 84,990 నుంచి రూ. 54,990కి అందుబాటులో ఉంది.

Read Also : Motorola Latest Phones Sale : పండుగ సేల్ డీల్స్.. మోటోరోలా లేటెస్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

3. హెచ్‌పీ 15 :
మీరు రూ.35వేల లోపు ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే HP 15 కొనేసుకోవచ్చు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, కీబోర్డ్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కువ గంటలు టైప్ చేయడం, మల్టీ టాస్కింగ్ చేసే నిపుణులు, విద్యార్థులకు బెస్ట్ ల్యాప్‌టాప్. అడ్వాన్స్ ఇంటెల్ ప్రాసెసర్‌లు, స్టోరేజీ ఆప్షన్లు, ఫుల్-HD డిస్‌ప్లేతో వస్తుంది. ల్యాప్‌టాప్ సేల్ సమయంలో ఈ ల్యాప్‌టాప్ 36 శాతం ధర తగ్గింపుతో రూ.33,990కి లభిస్తుంది.

4. లెనోవా యోగా స్లిమ్ 7 :

ప్రస్తుతం అమెజాన్‌లో లెనోవా యోగా స్లిమ్ 7 ల్యాప్‌టాప్ రూ.70,990కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.1,10,490 నుంచి తగ్గింది. కొనుగోలుదారులకు భారీ 36శాతం తగ్గింపును అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా రూ. 5,650 ఆదా చేయొచ్చు. అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 750 తగ్గింపు పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అల్ట్రాబుక్ డీల్‌లలో ఇదొకటి. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీమియం ల్యాప్‌టాప్‌ను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ 14-అంగుళాల అల్ట్రాబుక్ ఇంటెల్ ఏఐ రెడీ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 14 కోర్లు, 18 థ్రెడ్‌ 4.5GHz వరకు టర్బో స్పీడ్ అందిస్తుంది.16GB LPDDR5x ర్యామ్, 512GB PCIe 4.0 SSDతో కలిపి మల్టీ టాస్కింగ్, స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. WUXGA ఓఎల్ఈడీ డిస్‌ప్లే 400 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR ట్రూ బ్లాక్ 500, 100శాతం DCI-P3 కలర్ కవరేజ్ కంటెంట్ క్రియేషన్, స్ట్రీమింగ్ కోసం అద్భుతమైన శక్తివంతమైన విజువల్స్‌ అందిస్తుంది.

5. డెల్ 15 :
అమెజాన్‌లో డెల్ వోస్ట్రో 15 ల్యాప్‌టాప్ రూ.32,990కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.48,441 నుంచి 32శాతం తగ్గింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా రూ.2,000 ఆదా చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా రూ.500 తగ్గింపు పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు ఆఫర్లు కాకుండా మంచి ల్యాప్ టాప్ కోసం చూసే విద్యార్థులు, ప్రొఫెషనర్లకు ఆకర్షణీయమైన ఆఫర్ అని చెప్పొచ్చు.

ఈ 15.6-అంగుళాల ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB DDR4 ర్యామ్, 512GB SSDతో వస్తుంది. పూర్తి HD (1920×1080) డిస్‌ప్లేతో స్మూత్ స్క్రోలింగ్, క్యాజువల్ మీడియా ప్లేబ్యాక్ కోసం 120Hz ప్యానెల్‌తో వస్తుంది. కేవలం 1.69 కిలోల బరువుతో డెల్ వోస్ట్రో 15 సన్నగా, పోర్టబుల్‌గా ఉంటుంది. అయితే, విండోస్ 11 హోమ్ సెక్యూరిటీ, అడ్వాన్స్ ఫీచర్లను కలిగి ఉంది.