10tvలో సోషల్ ముచ్చట్లు : ‘Trending Now’ మొదలైంది!

  • Published By: sreehari ,Published On : December 23, 2019 / 02:14 PM IST
10tvలో సోషల్ ముచ్చట్లు : ‘Trending Now’ మొదలైంది!

Updated On : December 23, 2019 / 2:14 PM IST

సోషల్ మీడియాలో ట్రెండింగ్ వార్తలకు కొదవే లేదు. ఫేస్ బుక్ నుంచి ట్విట్టర్… వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ వరకు అన్ని ప్లాట్ ఫాంలపై రోజుకీ ఎన్నో హాట్ టాపిక్స్ హల్ చల్ చేస్తుంటాయి.

ట్విట్టర్‌లో లేటెస్ట్ న్యూస్‌ ట్రెండింగ్ టాపిక్స్‌గా నిలిస్తే.. ఫేస్ బుక్‌లో సన్సెషన్స్‌ పోస్టులు, వాట్సాప్‌లో హాట్ కామెంట్లు, యూట్యూబ్‌లో వైరల్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టన్నింగ్ షేరింగ్ ఫొటోలతో నెట్టింట్లో యూజర్లను ఫుల్ ట్రెండీగా కనువిందు చేస్తుంటాయి.

అయితే, సోషల్ ప్లాట్ ఫాంపై యూజర్లను ఎంటర్ టైన్ చేసే వైరల్ వీడియోలన్నింటిని ఒకేసారి చూడాలని అనుకుంటున్నారా? టాప్ ట్రెండింగ్ న్యూస్‌తో మీ ముందుకు వస్తోంది 10టీవీ.. ఇక సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9.30 గంటలకు సోషల్ ముచ్చట్లతో Trending Now అంటూ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్స్ మీకు అందించనుంది.

ఎక్కడెక్కడో జరిగిన ఫన్నీ ముచ్చట్ల నుంచి హాట్ టాపిక్స్ వరకు అన్ని ఒకేసారి చూడాలంటే ‘Trending Now’ షో చూడాల్సిందే.. డోంట్ మిస్..