UPI Charges : యూపీఐ ఛార్జీలపై నెట్టింట్లో మీమ్స్ ట్రెండింగ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదిగో..!

UPI Charges : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇప్పటివరకూ యూపీఐ పేమెంట్లు ఉచితమని అందరికి తెలిసిందే. కానీ, ఇకపై యూపీఐ పేమెంట్లు చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందేనని తెలిసేసరికి వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.

UPI Charges : యూపీఐ ఛార్జీలపై నెట్టింట్లో మీమ్స్ ట్రెండింగ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదిగో..!

UPI payment to be charged from April 1, Netizens react with MEMES on Twitter

Updated On : March 29, 2023 / 4:26 PM IST

UPI Charges : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్లు చేస్తే ఛార్జీల మోత తప్పదు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో (#UPICharges) హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ప్రతిఒక్కరూ యూపీఐ పేమెంట్లకు బాగా అలవాటుపడ్డారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు అన్ని చోట్ల యూపీఐ పేమెంట్లు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ యూపీఐ పేమెంట్లు ఉచితమని అందరికి తెలిసిందే. కానీ, ఇకపై యూపీఐ పేమెంట్లు చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందేనని తెలిసేసరికి వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవలే దీనిపై ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఎవరైతే యూపీఐ పేమెంట్లను రూ. 2వేలకు మించి చేస్తే.. ఆయా లావాదేవీలపై ఇంటర్ చేంజ్ ఫీజు 1.1శాతం చెల్లించాల్సి ఉంటుంది.

చాలామంది యూపీఐ వినియోగదారుల్లో ఒకటే సందేహం.. ఈ కొత్త ఛార్జీలు అందరికి వర్తిస్తాయా? అనేది గందరగోళం నెలకొంది. అనేక మంది సోషల్ మీడియా వేదికగా యూపీఐ ఛార్జీల ప్రకటనపై మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. యూపీఐ ఛార్జీల బాదుడుపై నెటిజన్లు ఫన్నీ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

Read Also : Electricity Bill on Paytm : పేటీఎం ద్వారా కరెంట్ బిల్లు కడుతున్నారా? ఇలా చేస్తే.. 100శాతం క్యాష్‌బ్యాక్, మరెన్నో రివార్డులు పొందవచ్చు..!

యూపీఐతో లింక్ అయిన బ్యాంకులకు ఎలాంటి ఛార్జీలు లేవంట.. యూపీతో లింక్ అయిన వ్యాలెట్లకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయట అని ఒక నెటిజన్ పోస్టు చేయగా.. మరో నెటిజన్ యూపీఐ లావాదేవీలు రూ. 2వేలు మించితే 1.1శాతం ఛార్జీలు చెల్లించాలి.. అదే క్యాష్ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు లేనట్టేగా అంటూ మీమ్స్ పోస్టు చేశాడు.


మరో యూజర్ అయితే.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి యూపీఐ ఛార్జీల గురించి తెలిసి అతని మూడ్ ఎలా మారింది చూడు అంటూ ఫన్నీగా పోస్టు పెట్టాడు.


యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు అనగానే అందరూ ఇండియన్స్ క్యాష్ పేమెంట్స్ వైపు ఎలా టర్న్ తీసుకుంటున్నారో చూడండి అంటూ ఓ ఫొటోను పోస్టు చేశాడు.

రూ. 2వేలు దాటితే యూపీఐ ఛార్జీలు తప్పవు తెలియగానే.. యూపీఐ యూజర్లంతా తగ్గేదేలే.. ఇకపై పేమెంట్లు చేసేది లేదు అంటూ ఇలా ఫన్నీగా స్పందిస్తున్నారు.


మరో నెటిజన్ అయితే.. యూపీఐ ఛార్జీలు చెల్లించలేని వాళ్లు క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయొచ్చు అంటూ మీమ్స్ పోస్టు చేశాడు.


మరికొంత మంది యూజర్లు యూపీఐ పేమెంట్లు చేయొద్దని, రూ. 149తో రీఛార్జ్ చేస్తే రూ. 2 ఛార్జీలు విధిస్తున్నారని, బైకాట్ #Bycott #UPI, #UPIcharges అంటూ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.

ఏప్రిల్ 11 నుంచి యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదు.. క్యాష్ పేమెంట్స్ బెటర్ అన్నట్టుగా ఫన్నీ మీమ్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ( UPI ) నెట్‌వర్క్‌లో మొబైల్ వ్యాలెట్ల నుంచి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI) వ్యాపారి లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీజును 1.1శాతంగా పెంచనున్నట్టు NPCI నిర్ణయించింది.

NPCI సర్క్యులర్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి.

Read Also : UPI Charges : రూ. 2వేలు దాటితే యూపీఐ పేమెంట్లపై బాదుడే బాదుడు.. సామాన్యులకు ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయా? NPCI క్లారిటీ ఇదిగో..!