భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఇప్పట్లో ఉండదు.. ఎందుకంటే?
ఈ గడువుకు ముందు మినహాయింపుల కొనసాగింపుపై లేదా ఉపసంహరణపై నిర్ణయం తీసుకునేందుకు వాషింగ్టన్‌లో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అమెరికా ట్రేడ్ ఎక్స్‌పాంషన్ చట్టం సెక్షన్ 232 కింద జరుగుతుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్ ప్రకటించినప్పటికీ దాని ప్రభావం భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై ప్రస్తుతం పడదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అదనపు టారిఫ్‌లు విధించకుండా అమెరికా 90 రోజుల మినహాయింపు ఇవ్వగా, అధిక టారిఫ్‌ల భారం లేకుండా భారత్ వస్తువులను ఎగుమతి చేసింది. ఈ మినహాయింపులు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమై, ఆగస్టు 14తో ముగియనున్నాయి.
Also Read: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ఏముందోనని బీఆర్ఎస్‌లో కలవరం.. ఏం జరుగుతోంది?
ఈ గడువుకు ముందు మినహాయింపుల కొనసాగింపుపై లేదా ఉపసంహరణపై నిర్ణయం తీసుకునేందుకు వాషింగ్టన్‌లో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అమెరికా ట్రేడ్ ఎక్స్‌పాంషన్ చట్టం సెక్షన్ 232 కింద జరుగుతుంది.
బుధవారం ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల ప్రకారం.. భారతదేశంపై కనీసం 25 శాతం టారిఫ్ ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుంది. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో రష్యాను ఒంటరిని చేయాలన్న ప్రపంచ ఒత్తిళ్లను భారత్ నిర్లక్ష్యం చేసిందని.. రష్యా ఎనర్జీ, మిలిటరీ పరికరాల దిగుమతిని కొనసాగించిందని ట్రంప్ విమర్శించారు.
“దీంతో భారత్ ఆగస్టు 1 నుంచి 25 శాతం టారిఫ్, పైగా దీనిపై పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని కూడా తెలియజేశారు.