కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ఏముందోనని బీఆర్ఎస్‌లో కలవరం.. ఏం జరుగుతోంది?
కాళేశ్వరం రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించిందని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్.

కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్
ఏడాదిన్నరగా డైలీ ఎపిసోడ్‌గా కొనసాగిన విచారణ. 116 మందిని ప్రశ్నించి..ఎన్ని వివరాలు తెలుసుకుని..ఎందరో ఇంజనీర్లు, అధికారులను విచారించి..లాస్ట్‌కు కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు 2వందల మందిని విచారించి..కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా ప్రజా ప్రతినిధుల వాంగ్మూలాలను తీసుకుంది కమిషన్.
కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి మూడు నాలుగు సార్లు ఎక్స్‌టెన్షన్స్ ఇచ్చి ఫైనల్‌గా ఏడాదిన్నర తర్వాత విచారణ ముగించేశారు. ఇప్పుడే అసలు స్టోరీ మొదలైందని అంటున్నారు. కమిషన్ విచారణ ఒక ఎత్తు అయితే..ప్రభుత్వం ఆ రిపోర్ట్ బేస్‌గా ఏం చేయబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోందట.
Also Read: రూ.2 వేల కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం.. ఈ పథకంతో 2.9 కోట్ల మందికి ప్రయోజనాలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం క్యాబినెట్ ఆమోదంతో జరగలేదనేది ప్రభుత్వ వాదన. మంత్రివర్గంలో డిస్కస్ చేసే కాళేశ్వరం పనులు మొదలుపెట్టామని కేసీఆర్, హరీశ్‌రావుతో సహా ఈటల రాజేందర్ కూడా పీసీ ఘోష్‌కు ఇదే విషయం చెప్పారు. ఈ అంశాలపై కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసింది. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2016 మార్చి 1న కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి జారీ చేసిందని కమిషన్‌కు ప్రభుత్వం వివరాలు ఇచ్చిందంటున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పనులు ప్రారంభించే సమయానికి డీపీఆర్ కూడా లేదని కూడా ప్రభుత్వం కమిషన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిన తర్వాత ఏడాదిన్నరకు 2017లో మంత్రివర్గంలో ర్యాటిఫికేషన్ తీసుకొచ్చారని, అప్పటికే పనులు ఒక దశకు వచ్చాయని కమిషన్‌కు ప్రభుత్వం నివేదించినట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ఏం చెప్పిందనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను..కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల ఇచ్చిన డిటేయిల్స్‌లను క్రాస్ చేసుకున్న కమిషన్..రిపోర్ట్‌లో ఏ అంశాలను ప్రస్తావించిందో..ఎవరిని ముద్దాయిలుగా చూపించారోనన్న ఆందోళన అయితే కనిపిస్తోంది.
కమిషన్ ఏం తేల్చిందన్న దానిపై బీఆర్ఎస్ ఫోకస్?
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై బీఆర్ఎస్‌లో ఆందోళన కనిపిస్తోందట. నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ ఏం చెప్పారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఏం తేల్చిందన్న దానిపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ పూర్తి చేసి రేవంత్ సర్కార్‌కు రిపోర్ట్ ఇవ్వడంతో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అప్పటి మంత్రివర్గం ముందుకు రాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పడం.. విచారణలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ ఈ అంశంపైనే ప్రశ్నలు సంధించడం విచారణలో కీలకంగా మారిందని అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి క్యాబినెట్ మినిట్స్‌ను..కమిషన్‌కు ఇచ్చిన వివరాల్లోనూ మంత్రి తుమ్మల చెప్పిన అంశాన్నే నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అంశాలను ప్రస్తావించింది.. ఎవరిని దోషిగా తేల్చింది అనేది అయితే రిపోర్ట్ బయటికి వస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి కేసుల్లో విచారణ జరుగుతుండగా..ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏం తేల్చిందన్నదానిపై గులాబీ పార్టీని కలవరపెడుతోందట.
అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వంఅసెంబ్లీలో ప్రవేశ పెట్టబోతోందట. కాళేశ్వరం విషయంలో ఇప్పటివరకు ఆరోపణలకే పరిమితమైన ప్రభుత్వం.. కమిషన్ నివేదికలో ఉన్న అంశాలను బేస్ చేసుకుని కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను మరింత ఇరకాటంలో పెట్టాలని స్కెచ్ వేస్తోందట. అసెంబ్లీలో చర్చ పెట్టి కేసీఆర్‌ను సభకు రప్పించాలనే వ్యూహంలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాళేశ్వరం రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించారని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్. ఇప్పుడిదే అంశాన్ని పీసీ ఘోష్ కమిషన్ బేస్ చేసుకుని మరోసారి అసెంబ్లీలో చర్చ పెట్టి బీఆర్ఎస్‌ను ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోందట. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరంపై చర్చ జరిగితే తమకే లాభమని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోందట. కమిషన్ రిపోర్ట్‌లో ఏం చెప్పిందో..బీఆర్ఎస్ ఎలా డిఫెండ్ చేసుకోబోతుందో చూడాలి మరి.