Vi Maha Recharge Scheme : వోడాఫోన్ ఐడియా యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే ఉచితంగా 5G డేటా, మరెన్నో OTT బెనిఫిట్స్..!
Vi Maha Recharge Scheme : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే.. ఉచితంగా 5G డేటాను పొందవచ్చు. మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది.

Vodafone Idea is offering free 5GB data on all prepaid plans priced above Rs 299
Vi Maha Recharge Scheme : భారత టెలికం మార్కెట్లో 5G నెట్‌వర్క్‌పై తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G సర్వీసులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. 5G లాంచ్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. మరో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone-Idea) మాత్రం 5G నెట్‌వర్క్ ప్రారంభంలో ఆలస్యం కారణంగా వెనుకబడింది. ప్రస్తుతం Vi యూజర్ల సంఖ్య భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. తమ యూజర్లను నిలుపుకునేందుకు Vi టెల్కో కంపెనీ సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. పడిపోతున్న వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.
ఇటీవలి లాంచ్‌లో Vi కొత్త రీఛార్జ్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. Vi App ద్వారా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌పై అదనపు ఖర్చు లేకుండా అదనపు డేటాను అందిస్తోంది. Vi యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే చాలు.. అదనంగా 5GB డేటాను పొందవచ్చు. ఇందుకోసం ‘Maha recharge scheme‘ అనే ప్లాన్ Vi ప్రకటించింది. ఈ ప్లాన్ లిమిటెడ్-టైమ్ ఆఫర్ మాత్రమే.. రూ. 299 నుంచి అంతకంటే ఎక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ కేవలం మూడు రోజుల వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటుంది.
Vi 5GB అదనపు డేటాతో ప్లాన్ :
రూ.199 నుంచి రూ.299 మధ్య రీఛార్జ్ చేసుకునే యూజర్లకు 3 రోజుల పాటు అదనంగా 2GB డేటా లభిస్తుందని వోడాఫోన్ ఐడియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్, HTML5 ఆధారంగా 1200 కన్నా ఎక్కువ మొబైల్ గేమ్‌లను కలిగిన Vi యాప్‌లో (Vi) కస్టమర్‌లు Vi Movies & TV, Vi మ్యూజిక్, Vi గేమ్‌లను యాక్సెస్ చేయవచ్చని టెల్కో తెలిపింది.
ఇంతకుముందు, వోడాఫోన్ ఐడియా మరింత డేటా, ఎంటర్ టైన్మెంట్ ఆప్షన్లను కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు రూ. 368, రూ. 369 వద్ద అందుబాటులో ఉన్నాయి. తద్వారా అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. రెండు ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీ వ్యవధికి 60GB డేటాను (రోజుకు 2GB) అందిస్తాయి. అలాగే రోజుకు 100 మెసేజ్‌లు, Vi Movies & TVకి సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. అంతేకాదు.. మూవీలు, ప్రొగ్రామ్స్, లైవ్ TV ఛానెల్‌లను కూడా అందిస్తుంది.

Vi Maha Recharge Scheme : Vodafone Idea is offering free 5GB data on all prepaid plans priced above Rs 299
రెండు ప్లాన్‌ల మధ్య వ్యత్యాసం వాయిస్ కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 368 ప్లాన్ భారత మార్కెట్లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లను అందిస్తుంది. మూవీలు, షోలు, మ్యూజిక్, లైవ్ టీవీ వంటి అనేక రకాల సౌత్ ఇండియన్ కంటెంట్‌ను అందించే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ (SunNXT)కి సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. రూ. 369 ప్లాన్.. సోనీ ఛానెల్ నుంచి సినిమాలు, షోలు, స్పోర్ట్స్, లైవ్ టీవీ వంటి కంటెంట్‌ను అందించే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ SonyLIVకి సబ్‌స్క్రిప్షన్ ఇస్తుంది. ఈ బెనిఫిట్స్ మాత్రమే కాదు.. రెండు ప్లాన్‌లు కూడా Vi యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే కొన్ని ప్రత్యేక ఫీచర్‌లను అందిస్తున్నాయి.
ఈ ప్లాన్‌లతో పాటు, (Vi) గత నెలలో రూ.181 ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. మెయిన్ రీఛార్జ్ ప్లాన్ నుంచి రోజువారీ డేటా భత్యాన్ని త్వరగా ముగించే యూజర్లకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ సమయంలో (Vi) ఇటీవల రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రద్దు చేసింది. ఈ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. కానీ, అన్‌లిమిటెడ్ కాల్‌లు, OTT బెనిఫిట్స్ లేదా SMS బెనిఫిట్స్ అందంచదని గమనించాలి.