Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియాలో పెరిగిన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కొత్త ప్లాన్ల ధరలివే.. జూలై 4 నుంచి మరింత ప్రియం!

Vodafone Idea Plans : జూలై 4 నుంచి జియో, ఎయిర్‌టెల్ తర్వాత, వోడాఫోన్ ఐడియా కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. వోడాఫోన్ ఐడియా పెంచిన కొత్త ప్లాన్ల ధరల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియాలో పెరిగిన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కొత్త ప్లాన్ల ధరలివే.. జూలై 4 నుంచి మరింత ప్రియం!

Vodafone Idea prepaid and postpaid plans will cost ( Image Source : Google )

Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్, పోస్ట పెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగాయి. జూలై 4 నుంచి కొత్త ధరలు అందుబాటులో ఉంటాయి. మీరు వోడాఫోన్ ఐడియా యూజర్ అయితే, కొత్త ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత మీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై ఎక్కువ చెల్లించాలి. అంటే.. జూలై 4 నుంచి జియో, ఎయిర్‌టెల్ తర్వాత, వోడాఫోన్ ఐడియా కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. వోడాఫోన్ ఐడియా పెంచిన కొత్త ప్లాన్ల ధరల పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
రూ. 199 ప్లాన్ : ఈ ప్లాన్ ధర గతంలో రూ. 179 ఉండగా ఇప్పుడు రూ. 199కు పెరిగింది. 28 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.

రూ. 509 ప్లాన్ : గతంలో రూ. 459, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 509కు పెరిగింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో పాటు 6జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ ఉన్నాయి.

వార్షిక ప్లాన్ (రూ. 1999) : వార్షిక ప్లాన్ రూ. 1799 నుంచి రూ. 1999కి పెరిగింది. 365 రోజుల పాటు 24జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.

Read Also : Jio Mobile Plans : ఈ జియో ప్లాన్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

రోజువారీ డేటా ప్లాన్లు ఇవే :
రూ. 299 ప్లాన్ : ఈ ప్లాన్ ఇప్పుడు రూ. 269కి బదులుగా రూ. 299 పెరిగింది. రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు అందిస్తుంది.

రూ.349 ప్లాన్ : ఈ ప్లాన్ ధర రూ.299 నుంచి రూ.349కి పెరిగింది. రోజుకు 1.5జీబీ డేటా, ఉదయం (రాత్రి) 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.

రూ. 379 ప్లాన్ : గతంలో ఈ ప్లాన్ ధర రూ. 319 ఉండగా, ఇప్పుడు రూ. 379కు పెరిగింది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, ఉదయం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉంటాయి.

రూ. 579 ప్లాన్ : ఈ ప్లాన్ ధర రూ. 479 నుంచి రూ. 579కి పెరిగింది. 56 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటాను అదే అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.

రూ. 649 ప్లాన్ : గతంలో రూ. 539 నుంచి ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 649కు పెరిగింది. 56 రోజుల పాటు అదే అదనపు ఫీచర్లతో పాటు రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది.

రూ. 859 ప్లాన్ : ధర రూ. 719 నుంచి రూ. 859కి పెరిగింది. అన్ని అదనపు బెనిఫిట్స్‌తో పాటు 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది.

రూ. 979 ప్లాన్ : ఈ ప్లాన్ గతంలో రూ. 839 నుంచి ఇప్పుడు ధర రూ. 979కు పెరిగింది. అదే అదనపు ఫీచర్లతో 84 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది.

వార్షిక ప్లాన్ (రూ. 3499) : వార్షిక ప్లాన్ రూ. 2899 నుంచి రూ. 3499కి పెరిగింది. ఇందులో అన్ని అదనపు బెనిఫిట్స్‌తో పాటు రోజుకు 1.5జీబీ డేటా అందిస్తుంది.

డేటా యాడ్-ఆన్‌లు :
వన్ డే యాడ్-ఆన్ : ఇప్పుడు రూ. 19కి బదులుగా రూ. 22 ధర పెంపుతో 1జీబీ డేటాను అందిస్తోంది.
3-రోజుల యాడ్-ఆన్ : ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 48, రూ. 39 నుంచి పెరిగింది. 6జీబీ డేటాను అందిస్తుంది.

కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు :
రూ. 451 ప్లాన్ : ఈ ప్లాన్ ధర రూ. 401 నుంచి రూ. 451కు పెరిగింది. 200జీబీ వరకు రోల్‌ఓవర్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, అన్‌లిమిటెడ్ నైట్ డేటా, 3000 ఎస్ఎంఎస్‌లతో 50జీబీ డేటాను అందిస్తుంది. మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోనీ లైవ్, సన్ నెక్స్ట్, ఈజీమైట్రిప్ తగ్గింపు కూపన్‌లు లేదా 12 నెలల పాటు నార్తన్ మొబైల్ సెక్యూరిటీ వంటి ఆప్షన్ల నుంచి ఒక కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఎంచుకోవచ్చు.

రూ. 551 ప్లాన్ : గతంలో రూ. 501 ప్లాన్ ధర ఇప్పుడు రూ. 551కు పెరిగింది. 200జీబీ వరకు రోల్‌ఓవర్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ నైట్ డేటా, 3000 ఎస్ఎంఎస్‌లతో 90జీబీ డేటాను అందిస్తుంది. మీరు అమెజాన్ ప్రైమ్, స్విగ్గీ వన్, 6 నెలల పాటు ఈజీడైనర్ సబ్‌స్క్రిప్షన్‌లు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లైవ్, సన్ ఎన్ఎక్స్‌టీ, ఈజీమైట్రిప్ డిస్కౌంట్ కూపన్‌లు లేదా 12 నెలల పాటు నార్తన్ మొబైల్ సెక్యూరిటీ వంటి ఆప్షన్‌ల నుంచి రెండు కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఎంచుకోవచ్చు.

ఫ్యామిలీ ప్లాన్లు ఇవే :
రూ. 701 ప్లాన్ : ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 701గా ఉంది. గతంలో రూ. 601 నుంచి పెరిగింది. ప్రైమరీ లైన్‌కు 70జీబీ డేటా, సెకండరీ లైన్‌కు 40జీబీ డేటా, 200జీబీ వరకు రోల్‌ఓవర్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రైమరీ లైన్ కోసం అన్‌లిమిటెడ్ నైట్ డేటా ఉన్నాయి. 3000 ఎస్ఎంఎస్, ప్రైమరీ లైన్ యూజర్ 6 నెలల పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్ స్టార్, సోనీ లైవ్, సన్ నెక్స్ట్, ఈజీమైట్రిప్, డిస్కౌంట్ కూపన్‌లు లేదా 12 నెలల పాటు నార్తన్ మొబైల్ సెక్యూరిటీ వంటి ఆప్షన్‌ల నుంచి రెండు కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఎంచుకోవచ్చు.

రూ. 1201 ప్లాన్ :
గతంలో రూ. 1001 ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 1201కు పెరిగింది. ప్రైమరీ లైన్‌కు 140జీబీ డేటాను ప్రతి సెకండరీ లైన్‌కు 40జీబీ డేటాను అందిస్తుంది. గరిష్టంగా 200జీబీ వరకు రోల్‌ఓవర్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రైమరీ లైన్ కోసం అన్‌లిమిటెడ్ నైట్ డేటా, 3000 ఎస్ఎంఎస్, ప్రైమరీ లైన్ యూజర్ అమెజాన్ ప్రైమ్, స్విగ్గీ వన్, 6 నెలల పాటు ఈజీడైనర్ సబ్‌స్క్రిప్షన్‌లు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లైవ్, సన్ ఎన్ఎక్స్‌టీ, ఈజీమైట్రిప్ డిస్కౌంట్ కూపన్‌లు లేదా 12 నెలల పాటు నార్తన్ మొబైల్ సెక్యూరిటీ వంటి ఆప్షన్‌ల నుంచి రెండు కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఎంచుకోవచ్చు. జూలై 4 నుంచి ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.

Read Also : Mobile Recharge Plans : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కన్నా చౌకైన ధరకే బీఎస్ఎన్ఎల్ మొబైల్ ప్లాన్లు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!