WhatsApp : వాట్సాప్‌లో మీకు నచ్చినవారికి ‘Happy Diwali Sticker’ ఇలా పంపుకోవచ్చు..!
వాట్సాప్ యూజర్లందరికి వాట్సాప్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది. దీపావళి పండుగ సందర్భంగా వాట్సాప్ తమ యూజర్లకు హ్యాపీ దీపావళి స్టిక్కర్లను ప్రవేశపెట్టింది.

Whatsapp Brings New 'happy Diwali' Sticker Pack For Android
WhatsApp Happy Diwali Sticker : వాట్సాప్ యూజర్లందరికి వాట్సాప్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది. దీపావళి పండుగ సందర్భంగా వాట్సాప్ తమ యూజర్లకు హ్యాపీ దీపావళి (Happy Diwali Sticker) దీపావళి స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతిఒక్కరి జీవితంలో వెలుగులు నింపే దీపావళి రోజున ప్రతిఒక్కరూ స్నేహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా వాట్సాప్ దీపావళి స్టిక్కర్లను అందిస్తోంది. సరికొత్త ఈ వాట్సాప్ దీపావళి స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకుని వినూత్నంగా శుభాకాంక్షలు తెలపవచ్చు. ఈ దీపావళి స్టిక్కర్ల ద్వారా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయొచ్చు.
ఇంతకీ ఈ హ్యాపీ దీపావళి స్టిక్కర్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా? అయితే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.. మీరు పంపే వాట్సాప్ యూజర్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యూజర్ అయినా సరే సులభంగా హ్యాపీ దీపావళి స్టిక్కర్ పంపుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఎవరికి మీరు దీపావళి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారో వారి చాట్ బాక్సు ఓపెన్ చేయండి.. అందులో స్మైలీ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. Emoji బోర్డు దిగువ భాగంలో స్టిక్కర్ ఐకాన్ ఎంచుకోండి. ఆ తర్వాత ‘+’ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడే మీరు Happy Diwali Sticker కోసం సెర్చ్ చేయండి.
మీకు వాట్సాప్ సెర్చ్ బాక్సులో ఎలాంటి స్టిక్కర్లు కనిపించలేదా? అయితే ఈ లింకు (Happy Diwali Sticker Pack ) ద్వారా హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు మీ స్టిక్కర్ బోర్డులో కనిపిస్తుంది. మీరు మీకు నచ్చినవారికి హ్యాపీ దీపావళి స్టిక్కర్ పంపుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. మీరు కూడా మీ వాట్సాప్ ఓపెన్ చేసి మీ శ్రేయోభిలాషులకు దీపావళి స్టిక్కర్లతో శుభాకాంక్షలు తెలియజేయండి..
Read Also : Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!