WhatsApp Channels : వాట్సాప్‌లో కొత్త ఛానల్స్.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? మరెన్నో ప్రైవసీ ఫీచర్లు..!
WhatsApp Channels : వాట్సాప్ తమ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. సరికొత్త ఛానల్స్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఛానల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp Channels _ How to create, privacy features, and more
WhatsApp Channels : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. లేటెస్టుగా ఛానల్స్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. భారతీయ యూజర్లతో పాటు 149 దేశాలలో ఈ ఛానల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ మాదిరిగానే పనిచేస్తుంది. యూజర్లు తమ ప్రైవసీ విషయంలో రాజీ పడకుండా మరింత మంది ఆడియెన్స్ చేరుకోవడంలో సాయపడుతుంది.
మీ వాట్సాప్‌లో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఛానెల్‌లు అడ్మిన్‌లు టెక్స్ట్, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్‌లను పంపుకోవచ్చు. వాట్సాప్‌లో అప్‌డేట్‌లు అనే కొత్త ట్యాబ్‌లో ఛానెల్‌లను చూడవచ్చు. మీరు ఫాలో అయ్యేందుకు ఎంచుకున్న ఆప్షన్ల కింద స్టేటస్, ఛానల్‌లను కనుగొనవచ్చు. ఫ్యామిలీ, స్నేహితులు, కమ్యూనిటీలతో మీ చాట్‌లను వేరుగా చూడవచ్చు.
Read Also : WhatsApp for iPad : ఇది విన్నారా? ఐప్యాడ్‌లోనూ వాట్సాప్ సర్వీసులు.. ఈ కొత్త యాప్ ఎలా వాడాలంటే?
సొంత వాట్సాప్ ఛానల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? :
వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆపై వినియోగదారులు ప్రైమరీ విండోలో లేదా అప్‌డేట్‌ల ట్యాబ్‌లో కొత్త ఛానెల్‌ల ఆప్షన్ చూస్తారు. వాట్సాప్‌లో ఎవరైనా ఛానల్ ఆప్షన్‌కు కుడి వైపున ఉన్న ‘+’ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఛానల్‌ని క్రియేట్ చేయొచ్చు. మీరు దానిపై ట్యాప్ చేసిన తర్వాత యాప్ మీకు ఛానల్‌ని క్రియేట్ చేసే ఆప్షన్ అందిస్తుంది. మీరు దానికి ఒక పేరు, ఫొటోను కూడా యాడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి, మీరు క్రియేట్ చేసే ఛానల్‌ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని గమనించాలి.

WhatsApp Channels _ How to create, privacy features, and more
వాట్సాప్ ఛానల్‌లు.. ప్రైవసీ ఫీచర్లు :
మీరు ఛానల్ అడ్మిన్‌గా ఉంటే.. మీ ఫోన్ నంబర్, ప్రొఫైల్ ఫొటో ఫాలోవర్లకు కనిపించదు. అదేవిధంగా, ఛానల్‌ని ఫాలో చేయడం వల్ల మీ ఫోన్ నంబర్ అడ్మిన్లకు లేదా ఇతర ఫాలోవర్లకు బహిర్గతం చేయబడదు. వాట్సాప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మీరు ఎవరిని ఫాలో చేయాలని నిర్ణయించుకుంటారు అనేది మీ ఆప్షన్. ఇది ప్రైవేట్‌గా ఉంటుంది. ఛానల్ అప్‌డేట్‌లను ఎప్పటికీ స్టోర్ చేయడంపై ఎలాంటి ప్రయోజనం లేదని కంపెనీ విశ్వసిస్తోంది. అందుకే, వాట్సాప్ ఛానల్ హిస్టరీని 30 రోజుల వరకు మాత్రమే సర్వర్‌లలో స్టోర్ చేస్తుంది.
వాట్సాప్ ఛానల్‌లలో ఏం పోస్ట్ చేసేందుకు అడ్మిన్లకు అనుమతి ఉంది? :
పబ్లిక్ ఛానల్‌లో ఫొటోలు, టెక్స్ట్ మెసేజ్‌లు, లింక్‌లు లేదా మరేదైనా పోస్ట్ చేసేందుకు అడ్మిన్లకు అనుమతి ఉంటుంది. వారి ఛానల్ నుంచి స్క్రీన్‌షాట్‌లు, ఫార్వార్డ్‌లను బ్లాక్ చేసే అవకాశం కూడా వారికి ఉంటుంది. ఫాలోవర్లు పబ్లిక్ ఛానెల్‌లో రిప్లయ్ ఇవ్వడానికి లేదా మెసేజ్‌లను పంపడానికి అనుమతి ఉండదు. కానీ, ఏ పోస్ట్‌కైనా ఎమోజితో రెస్పాండ్ కావచ్చు.
అడ్మిన్‌లు తమ ఛానల్‌ని ఎవరు ఫాలో చేయాలో డైరెక్టరీలో వారి ఛానెల్ కనిపించాలని వారు కోరుకుంటున్నారో లేదో నిర్ణయించుకునేలా అడ్మిన్లకు అనుమతి ఉంటుంది. విస్తృత ఆడియెన్స్ చేరుకోవడమే ఛానల్‌ల లక్ష్యంగా ఉంటుంది. వాట్సాప్ ఛానల్స్ డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.