Whatsapp Update : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. ఇకపై వీడియో, ఆడియో కాల్స్‌లో మ్యూట్, కెమెరా ఆఫ్ చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!
Whatsapp Update : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఆడియో, వీడియో కాల్స్ సమయంలో మ్యూట్ చేయడం, కెమెరా ఆఫ్ బటన్ వంటి ఫీచర్లను యాక్సస్ చేయొచ్చు.

Whatsapp Updates
Whatsapp Update : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్లను తీసుకొస్తోంది. ముఖ్యంగా ఆడియో, వీడియో కాల్స్ చేసేవారికి ఈ ఫీచర్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఆడియో, వీడియో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ మరితం మెరుగుపర్చేందుకు వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ కోసం కొత్త ఫీచర్లను టెస్టింగ్ చేస్తోందని చెబుతున్నారు.
ఫీచర్ ట్రాకర్ ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాయిస్ కాల్స్ అంగీకరించే ముందు వినియోగదారులు వారి మైక్రోఫోన్‌ను మ్యూట్ చేసేందుకు అనుమతించే కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. అదే సమయంలో వీడియో కాల్స్ కోసం ఎమోజీ రియాక్షన్లు, వీడియో కాల్ ఆన్సర్ చేసే ముందు కెమెరాను ఆఫ్ చేసే ఫీచర్ కూడా వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది.
వాట్సాప్‌లో కొత్త ఆడియో, వీడియో ఫీచర్లు :
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ (WABetaInfo) ప్రకారం.. మెటా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ క్లయింట్ యాప్ ఫ్యూచర్ వెర్షన్‌లో రిలీజ్ చేసేందుకు 3 కొత్త ఆడియో, వీడియో ఫీచర్‌లను టెస్టింగ్ చేస్తోంది. ఆండ్రాయిడ్ యాప్ వెర్షన్ 2.25.10.16 కోసం వాట్సాప్ బీటాలో గుర్తించారు. ఈ ఫీచర్లలో ఒకటి వాయిస్ కాల్స్ అసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. వినియోగదారులు తమ మైక్రోఫోన్‌ను ఆఫ్ చేసి కాల్స్ ఆన్సర్ చేసే ముందు మ్యూట్ చేసేందుకు వీలుంటుంది.
వాట్సాప్ వీడియో కాల్స్‌కు ఆన్సర్ ఇచ్చే ముందు ఫోన్ కెమెరాను క్లోజ్ చేసే ఆప్షన్ కోసం కొత్త ఆప్షన్ టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా రిసీవర్ వీడియో కాల్స్ అందుకున్నప్పుడు ‘Turn off your video’ అనే ఆప్షన్ కనిపించవచ్చు. కాల్ వాయిస్-ఓన్లీ మోడ్‌లో కనెక్ట్ అవుతుంది అనమాట. గత నెలలో (APK) టియర్‌డౌన్‌లో ఈ ఫీచర్ కనిపించగా, ప్రస్తుతం డెవలపింగ్ స్టేజీలో ఉందని నివేదిక తెలిపింది.
కెమెరా ఇప్పటికే ఆఫ్‌లో ఉంటే.. యాప్ కన్ఫర్మేషన్ మరో ‘Accept without video’ ప్రాంప్ట్‌ను కూడా డిస్‌ప్లే చేయొచ్చు. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం.. ఆండ్రాయిడ్ వాట్సాప్‌లో త్వరలో మరో వీడియో సంబంధిత ఫీచర్ ఎమోజి రియాక్షన్స్ అందుబాటులోకి రానుంది.
వీడియో కాల్‌లో పాల్గొన్న వినియోగదారులు రియల్ టైమ్‌లో ఎమోజీలతో రెస్పాండ్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. వీడియో కాల్ సమయంలో తమ రియాక్షన్స్ ద్వారా బొటనవేలు పైకి లేపడం, నవ్వే ఎమోజి లేదా హార్ట్ వంటి ఎమోజీలతో స్పందించవచ్చు.
ఒక యూజర్ మెసేజ్‌కు వీడియో కాల్స్ కన్వర్జేషన్ బ్రేక్ కాకుండా రిస్పాండ్ అవ్వొచ్చు. ఎక్కువ సంఖ్యలో వీడియో కాల్స్‌లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుందని ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్లు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న బీటా టెస్టర్లకు మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని (WABetaInfo) పేర్కొంది.