WhatsApp Voice Notes Feature : వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. మీ వాయిస్ నోట్స్ వినగానే మాయమైపోతాయి..!

WhatsApp Voice Notes Feature : వాట్సాప్ తమ వినియోగదారుల ప్రైవసీని మరింత పెంచేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాయిస్ నోట్స్ కోసం వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ అదృశ్యమయ్యే వాయిస్ నోట్స్ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp Voice Notes Feature : వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. మీ వాయిస్ నోట్స్ వినగానే మాయమైపోతాయి..!

WhatsApp introduces disappearing voice notes feature to keep your conversations private

Updated On : December 8, 2023 / 6:49 PM IST

WhatsApp Voice Notes Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ ఫీచర్లను అందించిన వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే మరో కొత్త ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇటీవలే మెసేజింగ్ ప్లాట్‌ఫారంలో వాయిస్ నోట్స్ ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు దానికి వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

దీని ద్వారా యూజర్‌లు ఒక్కసారి ఏదైనా వాయిస్ నోట్స్ విన్న తర్వాత అది ఆటోమాటిక్‌గా అదృశ్యమై పోతుంది. వాయిస్ మెసేజ్‌లను పంపడానికి ముందుగానే వినియోగదారులు వ్యూ వన్స్ మోడ్ ద్వారా పంపుకోవచ్చు. 2021లో వాట్సాప్ ఇదే తరహాలో ఫొటోలు, వీడియోల కోసం వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇప్పుడు వాయిస్ నోట్స్ కోసం అదే వ్యూ వన్స్ ఫీచర్‌ను చేర్చింది.

ఇకపై ఆ భయం అవసరం లేదు :
అదృశ్యమయ్యే వాయిస్ నోట్స్ ఫీచర్ యూజర్ల మెసేజ్‌లకు అదనపు ప్రైవసీని అందించనుంది. మీరు ఇతరులకు పంపిన వాయిస్ నోట్ మరొకరికి ఫార్వార్డ్ చేస్తారని ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఇకపై వాయిస్ నోట్ పంపే ముందు ఈ ఫీచర్‌ని ఆన్ చేసి వాయిస్ నోట్‌ని పంపవచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుడితో సున్నితమైన వివరాలను షేర్ చేయడం లేదా మీరు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మీ మెసేజ్ మరెవరూ వినకూడదనుకుంటున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగించవచ్చు.

Read Also : Infinix Smart 8 HD Launch : భారీ బ్యాటరీతో ఇన్పినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే..!

మీ వ్యక్తిగత వివరాలు పంపినా ఇబ్బంది ఉండదు :
మీ క్రెడిట్ కార్డ్ వివరాలను స్నేహితులకు లేదా ఇతరులకు వాయిస్ నోట్స్ ‘వ్యూ వన్స్’ ద్వారా పంపినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోటోలు, వీడియోలతో పాటు వాయిస్ నోట్స్ పంపిన తర్వాత యూజర్లకు వ్యూ వన్స్ అనే ‘వన్-టైమ్’ ఐకాన్‌తో కనిపిస్తాయి. అయితే, ఇలాంటి మెసేజ్‌లు ఒకసారి మాత్రమే ప్లే అవుతాయని కంపెనీ పేర్కొంది.

అదృశ్యమయ్యే వాయిస్ మెసేజ్ పంపడానికి.. మీ మెసేజ్‌ను ఎప్పటిలాగే రికార్డ్ చేయొచ్చు. ఆపై పంపే ముందు కొత్త వన్-టైమ్ ఐకాన్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీరు పంపిన వాయిస్ మెసేజ్ రిసీవర్ ఒక్కసారి మాత్రమే వినగలరు. ఆ తర్వాత అది వారి చాట్ హిస్టరీ నుంచి వెంటనే అదృశ్యమవుతుంది.

WhatsApp introduces disappearing voice notes feature to keep your conversations private

WhatsApp disappearing voice notes feature  

వాట్సాప్ కూడా మీ మెసేజ్ చూడలేదు : 
వాట్సాప్‌లో మీ అన్ని వ్యక్తిగత మెసేజ్‌ల మాదిరిగానే అదృశ్యమయ్యే వాయిస్ మెసేజ్‌లు డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఉంటాయి. అంటే.. పంపినవారు, రిసీవర్ మాత్రమే ఆయా మెసేజ్ చూడగలరు లేదా వినగలరు. వాట్సాప్ కూడా ఆయా మెసేజ్‌లను యాక్సెస్ చేయలేదు. వాయిస్ మెసేజ్‌ల కోసం వ్యూ వన్స్ ఫీచర్ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది. మీరు వాట్సాప్ హెల్ఫ్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా ఇది ఎలా పని చేస్తుందనే మరింత తెలుసుకోవచ్చు.

ఇటీవలి సంవత్సరాలలో వాట్సాప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ-కేంద్రీకృత ఫీచర్ల శ్రేణిలో అదృశ్యమవుతున్న వాయిస్ మెసేజ్ ఫీచర్ కొత్తది. వ్యూ వన్స్ మోడ్ ద్వారా ఫొటోలు, వీడియోలతో పాటు, వాట్సాప్ అన్ని మెసేజ్‌లు, కాల్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది.

అలాగే, చాట్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లను తొలగించే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. కొన్ని రోజుల క్రితమే వాట్సాప్ వినియోగదారులందరికీ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ చాట్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి పదాలు లేదా ఎమోజీలతో ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను రూపొందించేందుకు అనుమతిస్తుంది.

Read Also : WhatsApp Status Updates : మీ వాట్సాప్ స్టేటస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసుకోవచ్చు? ఇదేలా పనిచేస్తుందంటే?