WhatsApp New Privacy Policy : కొత్త ప్రైవసీ పాలసీ వెనక్కి తీసుకోవాలి.. వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు..

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటీసులు పంపింది. కొత్త ప్రైవసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది.

WhatsApp New Privacy Policy : కొత్త ప్రైవసీ పాలసీ వెనక్కి తీసుకోవాలి.. వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు..

Whatsapp It Ministry Again Directs Company To Withdraw New Privacy Policy

Updated On : May 19, 2021 / 4:11 PM IST

WhatsApp new privacy policy : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటీసులు పంపింది. కొత్త ప్రైవసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది.

లేదంటే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కొత్త ప్రైవసీ విధానం అమలును వాయిదా వేయడం ద్వారా అంతర్జాతీయ యూజర్ల ప్రైవసీ పాలసీ, భద్రతా నిబందనల విషయంలో తప్పించుకోలేరని వాట్సాప్‌కు పంపిన నోటీసుల్లో కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వశాఖ పేర్కొంది. వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ విధానం ద్వారా భారత్‌లోని పౌరుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదముందని పేర్కొంది.

డేటా ప్రైవసీ, డేటా భద్రత, యూజర్ల ఎంపికలకు ఈ విధానం వ్యతిరేకంగా ఉందని నోటీసుల్లో పేర్కొంది. ఏడు రోజుల్లోగా దీనిపై సరైన వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని వాట్సాప్‌కు నోటీసుల్లో హెచ్చరించింది.