Whatsapp Events : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూప్ చాట్స్‌లో ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు!

Whatsapp Events : ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా యూజర్లు ఇప్పుడు ఈవెంట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ పేరు, వివరణ, తేదీ, ఆప్షనల్ లొకేషన్ వంటి ఈవెంట్ వివరాలను ఇన్‌పుట్ చేయవచ్చు.

Whatsapp Events : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూప్ చాట్స్‌లో ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు!

WhatsApp create events in group chats ( Image Source : Google )

Whatsapp Events : వాట్సాప్ యూజర్ల కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. సాధారణ గ్రూప్ చాట్‌లలో ఈవెంట్స్ క్రియేట్ చేసుకునేందుకు యూజర్లను అనుమతించనుంది. ఈ మేరకు ఈవెంట్స్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇంతకుముందు, ఈ ఫీచర్ కేవలం కమ్యూనిటీలకు మాత్రమే పరిమితంగా ఉండేది.

Read Also : Oppo Reno 12 5G Series : ఏఐ ఫీచర్లతో ఒప్పో నుంచి రెండు సరికొత్త 5జీ సిరీస్ ఫోన్లు.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

అయితే, వాట్సాప్ ఇప్పుడు ఈ ఫీచర్‌ని సాధారణ గ్రూప్ చాట్‌లకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా యూజర్లు ఇప్పుడు ఈవెంట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ పేరు, వివరణ, తేదీ, ఆప్షనల్ లొకేషన్ వంటి ఈవెంట్ వివరాలను ఇన్‌పుట్ చేయవచ్చు. వాయిస్ లేదా వీడియో కాల్ అవసరమా కాదా అని పేర్కొనవచ్చు.

గ్రూప్ చాట్‌లలో ఈవెంట్‌ని క్రియేట్ చేయండి :
నివేదిక ప్రకారం.. కొత్త అప్‌డేట్ పేపర్-క్లిప్ ఆప్షన్లలో మార్పులు చేస్తుంది. వాట్సాప్ ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్లను కూడా పొడిగించింది. పేపర్-క్లిప్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఫొటో, ఆడియో, కాంటాక్టు, లొకేషన్ యాడ్ చేయడం, పోల్‌ వంటి ఆప్షన్లను తొలగించడానికి అప్లికేషన్ ఉపయోగించవచ్చు. అప్‌డేట్ చేసిన తర్వాత ఈవెంట్‌ను క్రియేట్ చేయడానికి అప్లికేషన్ మరో ఆప్షన్ కూడా అందిస్తుంది.

ఈవెంట్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ చాట్‌లోని సభ్యులు ఈవెంట్ ఇన్విటేషన్లను చూడవచ్చు. ఆపై వాటిని ఆమోదించవచ్చు. అయితే, ఈవెంట్ వివరాలను అవసరమైన విధంగా అప్‌డేట్ చేసే సామర్థ్యాన్ని క్రియేటర్ మాత్రమే కలిగి ఉంటారు. ఈవెంట్‌లు ఎల్లప్పుడూ సేఫ్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని గమనించడం ముఖ్యం. ఈవెంట్స్ తో కమ్యూనికేట్ అయ్యే యూజర్లు ఈవెంట్ వివరాలు, కమ్యూనికేషన్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు.

గ్రూప్ సభ్యులందరికీ ప్రైవసీపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఈ కొత్త అప్‌డేట్ దశలవారీగా విడుదల అవుతుంది. గ్రూప్ చాట్‌ల కోసం ఈవెంట్ ఫీచర్ పొందాలంటే.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ బీటా లేటెస్ట్ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరింత మంది యూజర్లకు ఈవెంట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్‌లో మీడియా అప్‌లోడ్ కోసం మరో కొత్త ఫీచర్.. :
మరోవైపు.. వాట్సాప్ మీడియా అప్‌లోడ్ విఫలమైనప్పుడు యూజర్లకు తెలియజేసేలా వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. మీడియా షేరింగ్ విఫలమైనప్పుడు పింగ్ చేసేలా మెసేజింగ్ యాప్ ప్లాన్ చేస్తోంది. iOS యూజర్ల కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యాప్‌ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే మీడియా అప్‌లోడ్ పాజ్ చేయడం లేదా విఫలమైతే వెంటనే యూజర్లకు తెలిసిపోతుంది. అంతేకాదు.. కొత్త ఫీచర్ మీడియా అప్‌లోడ్‌ల స్టేటస్ రియల్ టైమ్ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది.

కనెక్టివిటీ సమస్యల కారణంగా లేదా మరో యాప్‌కి మారడం వల్ల అప్‌లోడ్‌కు అంతరాయం ఏర్పడినప్పుడు యూజర్లు ఏ ఫొటో లేదా వీడియో ప్రభావితం అయిందో సూచించే నోటిఫికేషన్‌ను పొందుతారు. ఈ ఫీచర్ వినియోగదారులకు వారి మీడియా అప్‌లోడ్‌ల గురించి నిరంతరం తెలియజేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. మెసేజ్‌లను వేగంగా లోడ్ చేయడంలో సాయపడుతుంది. యాప్ యాక్టివ్‌గా ఓపెన్ కానప్పటికీ సాఫీగా మీడియా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Read Also : Most Affordable Cars : కొత్త కారు కోసం చూస్తున్నారా? అత్యంత సరసమైన 3 కార్లు ఇవే.. కేవలం ధర రూ. 5 లక్షల లోపు మాత్రమే!