WhatsApp Android Phones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. 2025 జనవరి నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పనిచేయదు.. ఫోన్ల ఫుల్ లిస్టు..!

WhatsApp Android Phones : మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఐఫోన్‌లతో సహా ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సా్ప్ సపోర్టును నిలిపివేయనుంది.

WhatsApp Android Phones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. 2025 జనవరి నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పనిచేయదు.. ఫోన్ల ఫుల్ లిస్టు..!

WhatsApp To Stop Working On These Android Mobiles, Check Full List

Updated On : December 24, 2024 / 4:49 PM IST

WhatsApp Android Phones : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. 2025 జనవరి నుంచి వాట్సాప్ కొన్ని ఫోన్లలో పనిచేయదు. వెంటనే మీ ఫోన్లను అప్‍గ్రేడ్ చేసుకోవాలి. పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లో రన్ అయ్యే మిలియన్ల కొద్దీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ సపోర్టు నిలిచిపోనుంది.

మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఐఫోన్‌లతో సహా ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సా్ప్ సపోర్టును నిలిపివేయనుంది. ఎందుకంటే.. అడ్వాన్స్ ఓఎస్, హార్డ్‌వేర్ అవసరమైన కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తుంది.

వాస్తవానికి, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 10 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ మెసేజింగ్ యాప్‌కు సపోర్టును కోల్పోతోంది. జనవరి 2025 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటికీ కిట్‌క్యాట్ వెర్షన్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే.. అప్‌గ్రేడ్ చేయడానికి కొనుగోలు చేసేందుకు ఇదే సమయం.

ఇప్పటికీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వెర్షన్‌తో ఫోన్‌ను ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. వాట్సాప్ ఇప్పటికీ ఆ ఫోన్లలో ఓఎస్ సాఫ్ట్‌వేర్‌కు సపోర్టు ఇస్తోంది అయితే, 2025 ప్రారంభం నుంచి వినియోగదారులు కొత్త ఫోన్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడం తప్పనిసరి.

ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు :
జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ సపోర్టును కోల్పోతున్న ఫోన్‌ల జాబితాలో శాంసంగ్, ఎల్‍జీ, సోనీ, హెచ్‍టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు కూడా ఉన్నాయి.

  • శాంసంగ్
  • గెలాక్సీ ఎస్3
  • గెలాక్సీ నోట్ 2
  • గెలాక్సీ ఏస్ 3
  • గెలాక్సీ ఎస్4 మినీ
  • హెచ్‌టీసీ
  • వన్ ఎక్స్
  • వన్ ఎక్స్ ప్లస్
  • డిజైర్ 500
  • డిజైర్ 601
  • సోనీ
  • ఎక్స్‌పెరియా జెడ్
  • ఎక్స్‌పెరియా ఎస్‌పీ
  • ఎక్స్‌పీరియా టీ
  • ఎక్స్‌పీరియా వి
  • ఎల్‌‌జీ
  • ఆప్టిమస్ జీ
  • నెక్సాస్ 4
  • జీ2 మినీ
  • ఎల్90
  • మోటరోలా
  • మోటో జీ
  • రేజర్ హెచ్‌డీ
  • మోటో ఈ 2014

వాట్సాప్ మీ గూగుల్ డిస్క్ స్టోరేజ్ ద్వారా చాట్, డేటా బ్యాకప్‌కు సపోర్టు ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్‌లలో ఏదైనా డేటా కలిగి ఉన్నట్లయితే.. జనవరి 1కి ముందు బ్యాకప్ చేసుకోవాలి. వాట్సాప్ కేవలం ఆండ్రాయిడ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ఐఫోన్లలో కూడా ఈ మార్పులను చేస్తుంది. మెసేజింగ్ యాప్ ఇప్పుడు మెటా ఏఐతో సహా అనేక ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. అడ్వాన్స్ లేటెస్ట్ హార్డ్‌వేర్ రన్ కావాలి అంటే.. వాట్సాప్ అవసరం లేని పాత మోడల్‌లను జాబితా నుంచి తొలగిస్తుంది.

Read Also : WhatsApp Scan Documents : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌.. మీ ఫోన్ కెమెరాతో నేరుగా డాక్యుమెంట్‌లను స్కాన్ చేయొచ్చు..!