WhatsApp Bill Payment : వాట్సాప్ యూజర్లు ఎగిరిగంతేసే వార్త.. ఇక కరెంట్, గ్యాస్, క్రెడిట్ కార్డు బిల్లులన్నీ యాప్‌లోనే!
WhatsApp Bill Payment : ఈ బిల్ పేమెంట్ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు మల్టీ అకౌంట్లను మేనేజ్ చేసుకోవచ్చు. పేమెంట్ల సెక్షన్ కోసం గతంలో చెల్లించిన బిల్లుదారులను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.
WhatsApp Bill Payment
- వాట్సాప్ బిల్ పేమెంట్స్ ఫీచర్ వస్తోందోచ్
- భారత్ కనెక్ట్ నెట్వర్క్ ద్వారా 30 కేటగిరీలో 22,700పైగా యాక్సెస్
- వినియోగదారులు వాట్సాప్ నుంచి బయటకు వెళ్లనక్కర్లేదు
- యూపీఐ, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లతో బిల్లులు కట్టవచ్చు
WhatsApp Bill Payment : వాట్సాప్ యూజర్లకు పండగే.. ఇకపై పేమెంట్ల కోసం వేరే యాప్‌కు మారాల్సిన పనిలేదు. అనేక రకాల హోం, యుటిలిటీ బిల్లులను ఒకేచోట చెల్లించవచ్చు. ఈ కొత్త ఫీచర్ భారత్ కనెక్ట్ (BBPS) నెట్వర్క్ ఆధారంగా రూపొందించారు. 30 కేటగిరీలలోని 22,700 పైగా బిల్లుదారులకు యాక్సెస్‌ను అందిస్తుంది.
కరెంట్, వాటర్, గ్యాస్, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్‌లు, లోన్ చెల్లింపులతో పాటు ఇతర బిల్లులను కూడా చెల్లించవచ్చు. వినియోగదారులు తమ బిల్లులతో పాటు గత పేమెంట్లను ఈజీగా ట్రాక్ చేయొచ్చు.
వాట్సాప్ బిల్లు పేమెంట్లు :
ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ పేమెంట్స్ సెక్షన్లోనే కనిపిస్తుంది. యాప్ హోమ్ స్క్రీన్ పైభాగంలో (₹) ఐకాన్‌ను ట్యాప్ చేస్తే చాలు.. ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. యూజర్లు తమ బిల్ కేటగిరీని ఇందులోనే ఎంచుకోవాలి. తమ ప్రొవైడర్‌ను ఎంచుకుని అవసరమైన అకౌంట్ వివరాలను రిజిస్టర్ చేయొచ్చు.
Read Also : Realme P4s 5G Sale : వావ్.. సూపర్ ఫోన్ బ్రో.. ఈ రియల్‌మి 5G చీప్ గురూ.. బ్యాంకు ఆఫర్లతో తగ్గింపు ధరకే..!
డేటాను యాడ్ చేశాక వాట్సాప్ పేమెంట్ చేయని బిల్లు మొత్తాన్ని చూపిస్తుంది. పేమెంట్ చేసే ముందు వివరాలను రివ్యూ చేయొచ్చు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పేమెంట్లను ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. పేటీఎం ఇతర యాప్‌ల మాదిరిగానే ఈ ప్లాట్‌ఫారమ్ కూడా రెన్యువల్ మేనేజ్ పేమెంట్ కోసం పేమెంట్ మేనేజ్ మెంట్ కొత్త ఫీచర్లను అందిస్తోంది.
గతంలో చెల్లించిన బిల్లుదారులు ఇన్ స్టంట్ యాక్సెస్ కోసం పేమెంట్స్ హోమ్ స్క్రీన్‌పైనే చూడొచ్చు. అదే సమయంలో ఒకే బిల్లుదారుతో అనేక అకౌంట్లను యాడ్ చేయొచ్చు. అందులో ఇల్లు, ఆఫీసు లేదా ఫ్యామిలీ సభ్యుల కోసం వేర్వేరు పవర్, వాటర్ లేదా ఇతర యుటిలిటీ ఖాతాలను యాక్సస్ చేయొచ్చు. పేమెంట్స్ హోమ్ స్క్రీన్ ఎక్కువ వాడేవారికి బిల్ కేటగిరీలను కూడా ఆటోమేటిక్‌గా సూచిస్తుంది. అలాగే ‘See All’ ఆప్షన్ సపోర్ట్ చేసే కేటగిరీల వైడ్ లిస్టును పొందవచ్చు.
వాట్సాప్‌లో బిల్లులు ఎలా కట్టాలంటే? :
వినియోగదారులు ఈ కింది విధంగా వాట్సాప్ ఫీచర్‌ను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.
- వాట్సాప్ ఓపెన్ చేయండి.
- హోమ్ స్క్రీన్ పైభాగంలో (₹) ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
- సంబంధిత బిల్లు, కేటగిరీ, బిల్లుదారుని ఎంచుకోండి.
- అవసరమైన ఖాతా వివరాలను ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేయండి.
- వాట్సాప్ ద్వారా పొందిన బిల్లు మొత్తం, ఇతర సమాచారాన్ని చెక్ చేయండి.
- యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు.. ఏ పేమెంట్ మెథడ్ అనేది ఎంచుకోండి.
- పేమెంట్ కన్ఫార్మ్ చేయండి. ఆ తర్వాత మీ బిల్లు పేమెంట్ పూర్తి అయినట్టే
భారతీయుల కమ్యూనికేషన్, మర్చంట్ పేమెంట్లు, డిజిటల్ సర్వీసుల కోసం యాప్‌లో బిల్లు పేమెంట్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే మొబైల్ రీఛార్జ్‌లు, మెట్రో టిక్కెట్ బుకింగ్‌లు, చాట్బాట్ల ద్వారా ప్రభుత్వ సర్వీసులకు సపోర్టు ఇస్తోంది.
