Whatsapp Privacy : వాట్సాప్ ఖతర్నాక్ ఫీచర్.. సెట్టింగ్స్‌లో ఇలా చేస్తే.. ఇక నుంచి మీరు పంపే ఫొటోలు, వీడియోలు అవతలి వాళ్లు సేవ్ చేయలేరు..!

Whatsapp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్‌ బిగ్ అప్‌డేట్ అందిస్తోంది. వినియోగదారులకు డేటాను ఆటో-సేవ్ ఆప్షన్ కంట్రోలింగ్ అందించనుంది. కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

Whatsapp Privacy : వాట్సాప్ ఖతర్నాక్ ఫీచర్.. సెట్టింగ్స్‌లో ఇలా చేస్తే.. ఇక నుంచి మీరు పంపే ఫొటోలు, వీడియోలు అవతలి వాళ్లు సేవ్ చేయలేరు..!

Whatsapp Feature

Updated On : April 5, 2025 / 4:49 PM IST

Whatsapp Privacy : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వినియోగదారుల ప్రైవసీని ప్రొటెక్ట్ చేసేందుకు వాట్సాప్ కొత్త మార్పులను తీసుకొస్తోంది. ఇటీవల వాట్సాప్ ప్రైవసీ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్ కనిపించింది. కంపెనీ చాలా కాలంగా ఈ ఫీచర్‌ టెస్టింగ్ చేస్తోంది.

ప్రస్తుతానికి వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ కోసం కొద్దిరోజులు వేచి ఉండాల్సి రావచ్చు. ఈ ఫీచర్ అందరి వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత డేటా మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Read Also : City Killer Asteroid : అయ్య బాబోయ్.. 10 అంతస్తుల బిల్డింగ్ సైజులో భారీ గ్రహశకలం.. మనమైతే సేఫ్.. చంద్రుడిని ఢీకొట్టబోతుందా?

మీరు ఈ ప్రైవసీ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. మీరు పంపిన ఫొటో లేదా వీడియో ఏదైనా ఆటో సేవ్ కాదు.. ఇతరులకు కూడా ఫార్వార్డ్ చేయడం కుదరదు. ఈ కొత్త ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. మెటా ఏఐ చాట్స్ కూడా యాక్సస్ చేయలేరు.

ఈ కొత్త ఫీచర్ ఏంటి? :
వాట్సాప్ కొత్త అప్‌డేట్ యూజర్ల ప్రైవసీని మరింత పెంచుతోంది. ఎందుకంటే.. మీరు ఏదైనా డేటాను ఇతరులకు పంపితే అది ఆటోమాటిక్‌గా సేవ్ కాదు. అంటే.. మీరు ఆటో-సేవ్ ఆప్షన్ స్టాప్ చేయొచ్చు. ఆ డేటా యూజర్ డివైజ్‌లో కూడా మళ్ళీ సేవ్ చేయడం కుదరదు.

సాధారణంగా, మీడియా వాట్సాప్ ద్వారా యూజర్ అకౌంట్లలో ఆటోమాటిక్‌గా సేవ్ అవుతుంది. అంతేకాదు.. వాట్సాప్ యాప్‌లో కనిపించే డేటాను డివైజ్‌లో కూడా చూడొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇకపై యూజర్లు మీడియా ఫైల్స్ ఇతరుల ఫోన్లలో ఆటో సేవ్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట.

ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఇకపై మీరు పంపే ఏ ఫొటో లేదా వీడియో డేటాను ఎవరూ సేవ్ చేయాలో లేదో డిసైడ్ చేయొచ్చు. ఒక రకంగా యూజర్లకు అందించే డిసప్పియరింగ్ మెసేజ్ ఆప్షన్ లాగానే ఉంటుంది.

మీరు సాధారణ మెసేజ్‌లతో కూడా ఇలా చేయొచ్చు. మెసేజ్‌లో వచ్చే మీడియాను కూడా సేవ్ చేయవచ్చు. ఈ ఫీచర్ మొత్తం చాట్ ఎక్స్‌పోర్ట్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది. అంటే.. మీరు పంపిన మెసేజ్ ఫొటో లేదా వీడియోను ఇతరులు ఫార్వార్డ్ చేయలేరు.

Read Also : Jio Offers : జియో యూజర్లకు పండగే.. 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. OTT బెనిఫిట్స్ కూడా!

మెటా ఏఐని కూడా వాడలేరు :
మీరు ఈ సెట్టింగ్‌ను ఆన్ చేస్తే.. వాట్సాప్ యూజర్లు ‘అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ’కి కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మీ చాట్‌లో మెటా ఏఐని ఉపయోగించలేరు. ప్రస్తుతానికి, ఈ మొత్తం ప్రక్రియ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత వినియోగదారులు పూర్తి స్థాయిలో వినియోగించలేరు. అలాగే, కంపెనీ ప్రస్తుతం అన్ని ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది.

వాట్సాప్ మ్యూజిక్ షేరింగ్ ఆప్షన్ :
వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా అందించింది. వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్‌లో షేర్ చేసే మ్యూజిక్ తమ స్టేటస్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వినియోగదారులను ఆకట్టకునేందుకు కంపెనీ ఈ క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది.