WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?

ఇన్‌స్టంట్ మెసేంజర్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. మీ వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే నిర్దేశిత గడువులోగా ఆ మెసేజ్ డిలీట్ చేసే వీలుంది.

WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?

Whatsapp Will Soon Give More Time To Delete Messages You Sent By Mistake

Updated On : July 4, 2022 / 3:45 PM IST

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. మీ వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే నిర్దేశిత గడువులోగా ఆ మెసేజ్ డిలీట్ చేసే వీలుంది. అయితే, ఒకసారి పంపిన మెసేజ్ నిర్ణీత గడువు దాటిన తర్వాత అవతలి యూజర్ చాట్ నుంచి మెసేజ్ డిలీట్ చేయడం సాధ్యపడదు. వాట్సాప్ బీటా ఛానెల్‌లో మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత డిలీట్ చేయడానికి యూజర్లను అనుమతించడానికి కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేయనుంది.

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మెసేజ్‌లను పంపిన గంట తర్వాత వాటిని డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతించింది. ఈ ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే వర్తించదు. కానీ యూజర్లు తమ ఫోటోలు, వీడియోలు వంటి మీడియా ఫైల్‌లను కూడా అన్‌సెండ్ చేయవచ్చు. వాట్సాప్ అప్‌డేట్‌ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ (2.22.4.10) WhatsApp బీటాలో రిలీజ్ చేయనుంది. మెసేజ్ పంపిన తర్వాత రెండు రోజులు, 12 గంటల్లో యూజర్లు తమ మెసేజ్‌లను అన్‌సెండ్ చేయగలరని నివేదిక చూసిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫీచర్ తీసుకొస్తున్నట్టు తెలిపింది.

Whatsapp Will Soon Give More Time To Delete Messages You Sent By Mistake (1)

Whatsapp Will Soon Give More Time To Delete Messages You Sent By Mistake

కానీ, ఈ ఫీచర్ రిలీజ్ ఎప్పుడు అనేదానిపై స్పష్టత లేదు. వాట్సాప్ మరొక డిలీట్-సంబంధిత ఫీచర్‌పై కూడా టెస్టింగ్ చేస్తోంది. అతి త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. మీ చాట్‌లోని ఏదైనా మెసేజ్, మీడియా ఫైల్‌లను డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లను అనుమతిస్తుంది. బీటా యూజర్లకు అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టొచ్చు. వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్ నిర్దిష్ట వ్యక్తుల నుంచి హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయాలనుకునే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

అయితే గ్రూపు సభ్యుల నుంచి హైడ్ చేసుకోవచ్చు. ఒక అడ్మిన్ మాత్రమే తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. బీటా యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. 2022 చివరిలో Whatsapp కమ్యూనిటీలను  ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు Meta లీకైన డేటా ధృవీకరించింది. గ్రూప్ అడ్మిన్‌లకు డిలీట్ ఆప్షన్ కూడా Whatsapp కమ్యూనిటీలతో పాటు అందుబాటులోకి రానుంది.

Read Also : WhatsApp: వాట్సప్ ఆన్‌లైన్‌లో ఉండికూడా హైడ్ చేసుకోవచ్చు