WhatsApp Self-Chat : వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ వస్తోంది.. అది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
WhatsApp Self-Chat : ప్రస్తుతం వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రైవసీని మెరుగుపర్చేందుకు కొత్త అప్డేట్స్, ఫీచర్ల గ్రూపును అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో `Profile Photo in Group Chats', 'క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డింగ్ చేయడం' ఇంటర్నల్ బ్లర్ టూల్ అందుబాటులో ఉన్నాయి.

WhatsApp will soon rollout a self-chat feature, here is how it looks
WhatsApp Self-Chat : ప్రస్తుతం వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రైవసీని మెరుగుపర్చేందుకు కొత్త అప్డేట్స్, ఫీచర్ల గ్రూపును అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో `Profile Photo in Group Chats’, ‘క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డింగ్ చేయడం’ ఇంటర్నల్ బ్లర్ టూల్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు ఎప్పుడు లాంచ్ కానున్నాయో టైమ్‌లైన్ అస్పష్టంగా ఉంది. WhatsApp Android, iOS యూజర్ల కోసం కొత్త ‘Messages with yourself’ ఫీచర్‌ను టెస్టింగ్ ప్రారంభించింది.
ఎంపిక చేసిన Android, iOS బీటా టెస్టర్ల కోసం ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీ సొంత మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపడం ఎల్లప్పుడూ సాధ్యమే అని చెప్పవచ్చు. కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రత్యేకమైన చాట్ విండో అందుబాటులో లేదు. యూజర్ల నుంచి నోట్స్ పంపడానికి లేదా మీడియా ఫైల్‌లను పంపేందుకు ఒకే పార్టనర్లతో గ్రూపులను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
కొత్త అప్డేట్తో, మీరు మీ సొంత నంబర్‌కు చెందిన వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు యాప్ చాట్ క్యాప్షన్‌గా ‘Message yourself’ని యాడ్ చేయడం ద్వారా మీ పర్సనల్ చాట్ బాక్స్‌ను పొందవచ్చు. అదనపు యాక్సెస్ కోసం WhatsApp కాంటాక్ట్ లిస్ట్‌లో మీ ఫోన్ నంబర్ కూడా కనిపిస్తుంది.

WhatsApp will soon rollout a self-chat feature, here is how it looks
WaBetaInfo నివేదిక ప్రకారం.. మీరు మీ ఫోన్ నంబర్‌తో చాట్‌కు మెసేజ్ పంపితే.. మల్టీ డివైజ్ ఇకపై సపోర్టు లేని ఫీచర్ కానందున ఎల్లప్పుడూ మీ ఇతర లింక్ చేసిన డివైజ్లతో పొందవచ్చు. కొంతమంది బీటా టెస్టర్ల కోసం క్యాప్షన్ ద్వారా మీతో చాట్ ఫీచర్ అందిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత మంది యూజర్ల కోసం ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
యాప్ భవిష్యత్తు అప్డేట్లో WhatsApp ‘కాంటాక్ట్‌ల లిస్టులో మీ ఫోన్ నంబర్‌ను వీక్షించే సామర్థ్యం’ ఫీచర్‌ను అప్డేట్ చేస్తుంది. WhatsApp క్యాప్షన్ ఫీచర్లతో మీడియాను ఫార్వార్డ్ చేసే బీటా టెస్టింగ్ సామర్థ్యాన్ని కూడా లాంచ్ చేసింది. కొత్త అప్డేట్తో యూజర్లు ఇమేజ్‌లు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇప్పటివరకు, మీడియాను మాత్రమే ఫార్వార్డ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం WhatsApp కోసం బీటా టెస్టులకు ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Twitter: మొదటి విడతలో 30% మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైన ట్విట్టర్