AC Blast : ఏసీలు ఎందుకు పేలుతాయి? షాకింగ్ కారణాలివే.. ఈ తప్పులు అసలు చేయొద్దు.. ప్రాణాలు కాపాడే సేఫ్టీ టిప్స్..!
AC Blast : ఏసీ పేలుళ్లు చాలా అరుదు. అయినప్పటికీ చాలా ప్రాణాంతకం. ఇటీవలి సంఘటనలను పరిశీలిస్తే ఏసీ పేలుళ్లకు కొన్ని షాకింగ్ కారణాలు వెలుగులోకి వచ్చాయి.
Air Conditioners
AC Blast : మీ ఇంట్లో ఏసీ ఉందా? తస్మాత్ జాగ్రత్త.. ఆఫీసులు లేదా ఇళ్లు అయినా ఏసీల విషయంలో అసలు నిర్లక్ష్యం చేయొద్దు. తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ప్రాణాల మీదుకు తెచ్చిపెడతాయి.. వాస్తవానికి ఎయిర్ కండిషనర్ (Air Conditioners) పేలుళ్లు చాలా అరుదుగా జరుగుతాయి. కొన్నిసార్లు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇటీవల ఘజియాబాద్‌లో ఏసీ రిపేరింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగి ఒక టెక్నీషియన్ మరణించాడు.
అందుకే ఏసీలను రిపేరింగ్ చేయడం లేదా వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీలో యూనిట్ రిపేరింగ్ మధ్యలో స్విచ్ ఆన్ అయిందని రీసెర్చర్లు వెల్లడించారు. దేశీయ స్ప్లిట్ ఏసీ కంప్రెసర్ పేలుళ్ల కారణంగా ఇప్పటివరకూ ఏసీ మెకానిక్‌లు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలు ఎందుకు పేలుతాయి? :
రిఫ్రిజెరాంట్ లీకేజీలు, కంప్రెసర్ పనిచేయకపోవడం నుంచి అన్ సేఫ్ సర్వీసింగ్ పద్ధతులే పేలుళ్లకు కారణం. R290 లేదా R32 వంటి మండే వాయువుల వాడకం వంటివి కారణాలు ఉంటాయి. ఏసీలో ఏదైనా సంకేతం కనిపించగానే సరైన భద్రతా చర్యలను పాటించాలి. తద్వారా ఏసీ పేలుళ్ల ప్రమాదాలను నివారించవచ్చు.
ఏసీలు పేలడానికి ప్రధాన కారణం కంప్రెసర్ లోపల ఒత్తిడి పెరగడమే. పాడైపోయిన లోపలి భాగాలు, ఎయిర్ ఫ్లో ఆగిపోవడం లేదా వేడెక్కడం వల్ల ఇంటర్నల్ పార్టులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోతుంది. లీక్ టెస్టింగ్ సమయంలో ఉపయోగించే నైట్రోజన్ పూర్తిగా ఖాళీ అయితే కూడా కొన్నిసార్లు ఏసీ పేలుళ్లు సంభవిస్తాయి.
Read Also : Most Powerful Scooters : బైక్ లాంటి పవర్‌తో టాప్ 10 అత్యంత శక్తివంతమైన స్కూటర్లు ఇవే.. ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
ఏసీ పేలుళ్లపై శాస్త్రీయ, ఫోరెన్సిక్ ఆధారాలు :
కంప్రెసర్ ఫెయిల్యూర్ కావడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫోరెన్సిక్ అధ్యయనంలో రిపేరింగ్ సమయంలో ఏసీ కంప్రెసర్లు పేలిపోయిన మూడు ప్రాణాంతక కేసులను వివరించింది. సర్వీసింగ్ సమయంలో ఏసీ ఆన్ చేయడం లేదా సిస్టమ్ లోపల నైట్రోజన్‌ను రిలీజ్ చేయడం వంటి అన్ సేఫ్ మెథడ్స్ ప్రాణాంతక పేలుళ్లకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డర్టీ కాయిల్స్, తక్కువ లేదా హై రిఫ్రిజెరాంట్, విద్యుత్ లోపాలు, బ్లాక్ లైన్లు అన్నీ కంప్రెసర్‌పై ఒత్తిడికి గురిచేస్తాయి సాధారణ మెయింట్‌నెన్స్ చేయకపోవడం మరో కారణం. ప్రతి 6 నెలలకు సరైన సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల ఈ ప్రమాదాలను భారీగా తగ్గించవచ్చు.
ఇంట్లో ఏసీ బ్లాస్ట్‌లను ఇలా నివారించండి.. సేఫ్టీ టిప్స్ :
- ఏసీ రిపేరింగ్ ముందు యూనిట్‌ను స్విచ్ ఆఫ్ చేసి పూర్తిగా డిశ్చార్జ్ చేయండి.
- లీక్ టెస్ట్ తర్వాత హైడ్రోజన్ పూర్తిగా తొలగించండి.
- గాలి, తేమ, సరైన వాక్యూమింగ్ మెథడ్స్ వాడండి.
- కంప్రెసర్ ఒత్తిడిని నివారించేలా సరైన రిఫ్రిజెరాంట్ లెవల్స్ ఉంచండి.
- ఎయిర్ ఫ్లోకు సపోర్టు ఇచ్చే కాయిల్స్, ఫిల్టర్లను క్లీన్‌గా ఉంచండి.
- వైరింగ్, పవర్ సిస్టమ్ క్రమం తప్పకుండా చెక్ చేయండి.
- DIY బదులుగా ట్రైనింగ్ పొందిన ఎక్స్‌పర్ట్స్ హెల్ప్ తీసుకోండి.
తగినంత వాక్యూమింగ్ లేకుంటే సిస్టమ్ లోపల తేమ మిగిలిపోతుందని చెబుతుంటారు. రిఫ్రిజెరాంట్‌తో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దాంతో ప్రెజర్ పెరిగి చివరికి బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి దారితీస్తుంది.
