Samsung India: శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ మార్కెట్లోకి విడుదల: ధర ఎంతంటే?

గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సోమావారం నుంచి అధికారకంగా ప్రారంభమైనట్లు శాంసంగ్ సంస్థ తెలిపింది.

Samsung India: శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ మార్కెట్లోకి విడుదల: ధర ఎంతంటే?

Samsung

Updated On : March 21, 2022 / 5:20 PM IST

Samsung India: శాంసంగ్ సంస్థ ఇటీవల మూడు “ఏ” సిరీస్ స్మార్ట్ ఫోన్లను భారత్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గెలాక్సీ ఏ53 5జీ, ఏ73 5జీ ఏ33 5జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మార్చి మొదటి వారంలో విడుదలైన ఈ ఫోన్ల అమ్మకాలు మాత్రం మార్చి మూడో వారం తరువాత ప్రారంభం అవుతాయని శాంసంగ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈక్రమంలో ఏ53 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సోమావారం నుంచి అధికారకంగా ప్రారంభమైనట్లు శాంసంగ్ సంస్థ తెలిపింది. వినియోగదారులు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ద్వారాగానీ, నేరుగా శాంసంగ్ షోరూమ్, వెబ్ సైట్లలో గానీ ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. ధర విషయానికొస్తే 6 + 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ .34,499గానూ 8 + 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ .35,999గానూ నిర్ణయించారు. శామ్సంగ్ గెలాక్సీ ఎ53 5జి బ్లాక్, వైట్, లైట్ బ్లూ మరియు పీచ్ అనే నాలుగు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Also read: Message in Bottle: సముద్రంలో కొట్టుకొచ్చిన గాజు సీసా.. 7వేల కిలోమీటర్లు ప్రయాణించిన మెసేజ్

ఈ ఫోన్ ప్రత్యేకతలను గమనిస్తే..శామ్సంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ఫోన్లో 6.5 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి. గెలాక్సీ ఎ-సిరీస్లో మొదటిసారిగా 5Nm ఎక్సినోస్ 1280 చిప్ సెట్ ను అమర్చారు. ఈ ఫోన్ ర్యామ్ ప్లస్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది, దీంతో ఐడియల్ ర్యామ్ సామర్థ్యాన్ని 16 జిబి వరకు ఉపయోగించుకుని వినియోదారుడికి మంచి అనుభూతి ఇస్తుందని. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది. 25W ఛార్జర్ తో కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఫోన్ 50 శాతం ఛార్జ్ పొందగలదని శాంసంగ్ తెలిపింది. శామ్సంగ్ గెలాక్సీ ఎ53 5జిలో వెనుక భాగంలో OIS సాంకేతికతతో 64MP + 12MP + 5MP + 5MP క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీల కోసం 32 MP కెమెరా అమర్చారు. అన్నిటికి మించి ఆండ్రాయిడ్ 12OS తో వస్తున్నఈ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ ఫోన్ కు నాలుగేళ్ళ పాటు OS అప్డేట్ ఇస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది.

Also Read: Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు