X Down : బిగ్ బ్రేకింగ్.. ‘ఎక్స్’ సర్వర్ క్రాష్.. లాగిన్ అవ్వట్లేదు.. పోస్టులు పోవట్లేదు.. యూజర్ల ఫిర్యాదులు..!

X Down : ప్రస్తుతం భారత్‌లో వేలాది మంది వినియోగదారులకు ఎక్స్ పనిచేయడం లేదు. యాప్, వెబ్‌సైట్ రెండింటిలోనూ తీవ్ర అంతరాయం ఏర్పడిందని రిపోర్టులు సూచిస్తున్నాయి.

X Down : బిగ్ బ్రేకింగ్.. ‘ఎక్స్’ సర్వర్ క్రాష్.. లాగిన్ అవ్వట్లేదు.. పోస్టులు పోవట్లేదు.. యూజర్ల ఫిర్యాదులు..!

X Down

Updated On : November 18, 2025 / 6:47 PM IST

X Down : సోషల్ మీడియా ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్స్ పేజీ లోడ్ అవ్వడం లేదు.. కొత్త పోస్టులు పోవడం లేదు.. లాగిన్ కూడా కాలేకపోతున్నమంటూ వినియోగదారులల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వెబ్ మాత్రమే కాదు.. యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అన్ని డివైజ్‌ల్లో ఎక్స్ సర్వీసు పూర్తిగా స్తంభించిపోయింది.

ఔటేజ్-ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ (X Down) డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5:20 గంటలకు 1,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు తమ అధికారిక అకౌంట్లను యాక్సెస్ చేయలేకపోతున్నారని రిపోర్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ భారీ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.

Read Also : Apple iOS 26.2 Beta 3 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. iOS 26.2 బీటా 3 వచ్చిందోచ్.. కొత్త ఫీచర్ల ఫుల్ లిస్ట్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ లోపం విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వెబ్ వెర్షన్ (x.com) అలాగే, ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో మొబైల్ అప్లికేషన్‌లలో ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్‌ కోల్పోయినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.

X Server Down

X Server Down

మొబైల్ యాప్ నుంచి 61 శాతం ఫిర్యాదులు రాగా, ఆ తర్వాత వెబ్‌సైట్ 28శాతం, సర్వర్ కనెక్షన్ లోపాలు 11శాతంగా ఉన్నా యని డేటా వెల్లడిస్తుంది. ఈ విస్తృతమైన అంతరాయం ప్రపంచవ్యాప్త సమస్యగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులను తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

క్లౌడ్‌ఫ్లేర్ సిస్టమ్స్ ఫెయిల్ అవ్వడంతో వెబ్ యూజర్లు ఎక్స్ యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం.. ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్‌లోని సమస్యల వల్ల ఈ తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనిపై క్లౌడ్‌ఫ్లేర్ స్పందిస్తూ.. “క్లౌడ్‌ఫ్లేర్ సిస్టమ్స్ సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించి త్వరలోనే పరిష్కరిస్తాం,” మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని పేర్కొంది.

డౌన్ డిటెక్టర్ సర్వీసు కూడా సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంది. సైట్ లోడ్ అవుతున్నప్పుడు వినియోగదారుల రిపోర్టులలో భారీ పెరుగుదల నమోదైంది, చాలా మందికి “క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్‌లో ఇంటర్నల్ సర్వర్ లోపం ఎదురైంది.

క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ : కాన్వా, ఎక్స్, చాట్‌జిపీటీ, స్పాటిఫై వెబ్‌సైట్‌లకు భారీ అంతరాయం :

క్లౌడ్‌ఫ్లేర్ ఒక్కసారిగా డౌన్ కావడంతో ఎక్స్, Canva, OpenAI, Spotifyతో సహా అనేక మెయిన్ ప్లాట్‌ఫారమ్‌లు స్తంభించిపోయాయి. వేలాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయలేకపోయారు. సాయంత్రం 6 గంటల నాటికి, అవుటేజ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డెటెక్టర్ ఇప్పటికే 7,000 కంటే ఎక్కువ నివేదికలను లాగిన్ చేసింది. క్లౌడ్‌ఫ్లేర్ డాష్‌బోర్డ్, ఏఐఐలలో కూడా భారీగా అంతరాయం సంభవించిందని కంపెనీ ధృవీకరించింది.

ఈ తీవ్ర అంతరాయంపై వినియోగదారులు ఒకేసారి ఫిర్యాదు చేయడంతో డౌన్ డిటెక్టర్ కూడా పనిచేయడం మానేసింది. ఎందుకంటే.. ఈ సర్వర్ కూడా క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్లపైనే ఆధారపడి పనిచేస్తుంది. చివరికి సైట్ డౌన్ డిటెక్టర్ యాక్సస్ పొందిన తర్వాత, స్పాటిఫై, కాన్వా, ఎక్స్, చాట్‌జిపిటితో సహా మెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో ఎర్రర్ రిపోర్ట్‌ల డేటాను వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఇలాంటి అంతరాయం జరిగిన నెల తర్వాత క్లౌడ్‌ఫేర్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. AWS లోపం రెడ్డిట్, స్నాప్‌చాట్, ఫోర్ట్‌నైట్ వంటి వెబ్ సైట్లు కూడా క్రాష్ అయ్యాయి.