Xiaomi or Motorola: ఈ 2 స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్‌? కొనేముందు ఇవి తెలుసుకోవాల్సిందే..

డిజైన్, స్క్రీన్ బ్రైట్‌నెస్, కెమెరా వేరియేషన్స్ కోసం చూస్తే ఈ ఫోన్ కొనొచ్చు.

Xiaomi or Motorola: ఈ 2 స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్‌? కొనేముందు ఇవి తెలుసుకోవాల్సిందే..

Updated On : July 2, 2025 / 7:49 AM IST

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, షావోమీ 14 సీవీ స్మార్ట్‌ఫోన్లు యూజర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, షావోమీ 14 సీవీ రెండూ ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, శక్తిమంతమైన పర్ఫార్మన్స్‌తో మార్కెట్లోకి వచ్చాయి. పర్ఫార్మన్స్‌, స్క్రీన్ క్వాలిటీ, కెమెరా ఫీచర్లలో పలు తేడాలు ఉన్నాయి. కొనేముందు వీటిని తెలుసుకుని కొనాలి.

ప్రాసెసర్
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 Extreme చిప్ ఉంది, గరిష్ఠ వేగం 3.35GHz. 8GB RAM తో వేగవంతంగా స్పందిస్తుంది. షావోమీ 14 సీవీ 14 సీవీలో Snapdragon 8s Gen3 చిప్ ఉంది. గరిష్ఠ క్లాక్ స్పీడ్ 3GHz. ఇది కూడా 8GB RAM తో స్మూత్ గా పనిచేస్తుంది. అందుకే పవర్ పరంగా మోటోరోలా బాగుంటుంది.

డిస్‌ప్లే, బ్యాటరీ
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 6.7 అంగుళాల OLED స్క్రీన్ ఉంది, 1220×2712 రెజల్యూషన్, Pantone సర్టిఫికేషన్, 1500Hz టచ్ రిస్పాన్స్, 720Hz PWM డిమ్మింగ్ ఉంటుంది. గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది. 6000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Also Read: వావ్‌.. రూ.6,999కే కేక పెట్టించే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌.. 4 కలర్స్‌లో..

షియోమీ 14 సివిలో 6.55 అంగుళాల AMOLED స్క్రీన్, క్వాడ్ కర్వ్ డిజైన్, డాల్బీ విజన్ సర్టిఫికేషన్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్. బ్యాటరీ 4700mAh, 67W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ ఉంది, కానీ వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. డిస్‌ప్లే, బ్యాటరీ పరంగా మోటోరోలా బాగుంటుంది.

కెమెరా
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 50MP + 50MP + 10MP ట్రిపుల్ కెమెరా ఉంది, OIS, 4K 30fps వీడియో రికార్డింగ్. 50MP సెల్ఫీ కెమెరా ఉంది.

షావోమీ 14 సీవీలో లైకా ట్యూన్ చేసిన 50MP + 50MP + 12MP ట్రిపుల్ కెమెరా ఉంది, 4K 60fps వీడియో సపోర్ట్ ఉంటుంది. ముందు రెండు 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ ఇష్టం ఉన్న వారికి షావోమీ 14 సీవీ నచ్చుతుంది.

ధర
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర రూ.31,284.
షియోమీ 14 సివి ప్రారంభ ధర రూ.30,999, కొన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో రూ.39,999 వరకు ఉంటుంది.

ఏది కొనొచ్చు?
డిజైన్, స్క్రీన్ బ్రైట్‌నెస్, కెమెరా వేరియేషన్స్ కోసం చూస్తే షావోమీ 14 సీవీ కొనొచ్చు.
పవర్, బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన ఛార్జింగ్ కోరుకునేవారికి మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో బాగుంటుంది.