Xiaomi 15 Series Launch : పవర్‌ఫుల్ కెమెరాలతో షావోమీ రెండు అద్భుతమైన ఫోన్లు.. ఏఐ ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

Xiaomi 15 Series Launch : షావోమీ నుంచి రెండు షావోమీ 15, షావోమీ 15 అల్ట్రా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రొఫెషనల్ గ్రేడ్ లైకా కెమెరాలను కలిగి ఉన్నాయి. ధర, ఫీచర్లను వివరాలను ఓసారి లుక్కేయండి.

Xiaomi 15 Series Launch : పవర్‌ఫుల్ కెమెరాలతో షావోమీ రెండు అద్భుతమైన ఫోన్లు.. ఏఐ ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

Xiaomi 15 Series

Updated On : March 2, 2025 / 11:35 PM IST

Xiaomi 15 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. అందులో షావోమీ 15, షావోమీ 15 అల్ట్రా మోడల్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో రన్ అవుతాయి. ప్రొఫెషనల్ గ్రేడ్ లైకా కెమెరాలతో వస్తాయి. ఈ ఫోన్లు అమోల్డ్ డిస్‌ప్లేలతో అమర్చి ఉంటాయి.

90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే సిలికాన్ కార్బన్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. షావోమీ రెండు ఫోన్‌లు ఏఐ రైటింగ్, ఏఐ ఇంటర్‌ప్రెటర్, ఏఐ సబ్‌టైటిల్‌లు, ఏఐ స్పీచ్ రికగ్నిషన్, ఏఐ ఫోటో ఎడిటింగ్ టూల్స్ వంటి హైపర్‌ఏఐ ఫీచర్లతో వస్తాయి. ప్రపంచ మార్కెట్లో ఈ రెండు ఫోన్ల ధర ఎంత ఉంటుంది? ఫోన్లలో ఫీచర్ల ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : New Smartphones 2025 : మార్చిలో రిలీజ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఈ లిస్టులో మూడో ఫోన్ వండర్‌ఫుల్.. గేమింగ్, సెల్ఫీ ప్రియులు డోంట్ మిస్..

షావోమీ 15 అల్ట్రా, షావోమీ 15 ధర ఎంతంటే? :
ఈ రెండు ఫోన్‌ల భారతీయ ధరలు మార్చి 11న వెల్లడి కానున్నాయి. షావోమీ ఫోన్‌లు ప్రత్యేక ఫీచర్లతో షావోమీ ఇండియా సైట్‌లో లిస్టు అయ్యాయి. ధర మాత్రమే ఇంకా వెల్లడి కాలేదు. అయితే, గ్లోబల్ మార్కెట్లో షావోమీ 15 అల్ట్రా ఫోన్ ధర 16GB+512GB వేరియంట్ ధర 1499 యూరోలు (సుమారు రూ. 1,36,100) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, స్టాండర్డ్ మోడల్ అంటే.. షావోమీ 15 ధర 12GB+256GB వేరియంట్‌కు 999 యూరోలు (సుమారు రూ. 90,700) నుంచి ప్రారంభమవుతుంది.

కెమెరా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
షావోమీ 15 అల్ట్రా ఫోన్ డ్యూయల్ (నానో+నానో) సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. షావోమీ హైపర్ఓఎస్ 2 స్కిన్ ఆధారంగా ఆండ్రాయిడ్ 15 రన్ అవుతుంది. ఈ ఫోన్ నాలుగు OS అప్‌గ్రేడ్‌లకు అర్హత కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

16GB వరకు LPDDR5x ర్యామ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 6.73-అంగుళాల WQHD+ (1440×3200 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది.

కంపెనీ ఈ ఫోన్‌లో 4 లైకా-ట్యూన్డ్ కెమెరాలను అమర్చింది. 1-అంగుళాల టైప్ LYT-900 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. అలాగే, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ఓఐఎస్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ సోనీ IMX858 టెలిఫోటో కెమెరా సెన్సార్, ఓఐఎస్, 4.3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 200ఎంపీ ఐఎస్ఓసెల్ HP9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 512GB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజీ అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. :
ఈ ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 6, GPS, NFC, USB 3.2 జనరేషన్ 2 టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో కనిపించే సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బేరోమీటర్, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఈ ఫోన్ 5410mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది.

90W వైర్డు, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఛాసిస్ ఏరోస్పేస్-గ్రేడ్ గ్లాస్ ఫైబర్‌తో తయారైంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి రక్షణ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. షావోమీ 15 ఫ్లాగ్‌షిప్ షావోమీ 15 అల్ట్రా మాదిరిగానే అదే చిప్‌తో పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 16GB వరకు ర్యామ్ అందిస్తుంది.

స్టాండర్డ్ మోడల్ 6.36-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. అల్ట్రా మోడల్ మాదిరిగానే షావోమీ 15 కూడా OISతో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. OIS, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉంది. అల్ట్రా మోడల్ లాగా 32ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. షావోమీ 15 1TB వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.

Read Also : iPhone 17 Air : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వస్తోంది.. అత్యంత సన్నని ఐఫోన్ ఇదే.. ఫీచర్లు హైలైట్ అంట..!

ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ ఉంది. బ్లూటూత్ 5.4లో కనెక్టివిటీ ఆప్షన్లు దాదాపు అల్ట్రా మోడల్‌తో సమానంగా ఉంటాయి. కంపెనీ ప్రకారం.. షావోమీ ఫోన్ 90W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5240mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి రక్షణకు ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 25 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

షావోమీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోపు ఖర్చు లేకుండా వారంటీ లేని రిపేరింగ్ కూడా అందిస్తామని చెబుతోంది. కంపెనీ మొదటి 6 నెలల్లో ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తుంది.