Aug 15th Offers :’యమహా ఇండియా మోటార్’ కళ్లు చెదిరే ఆఫర్లు, వాహనం కొంటే రూ.1లక్ష

కరోనా సంక్షోభం నుంచి మార్కెట్ ఇప్పుడిప్పుడే కొలుకొంటోంది. వాహన రంగం పూర్తిగా డీలా పడిపోయింది. వాహన క్రయ, విక్రయాలు జరుగకపోవడంతో పలు కంపెనీలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడే పరిస్థితిలో మార్పు రావడంతో..వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. 2021, ఆగస్టు 15వ తేదీ సందర్భంగా..యమహా వాహనాలను కొనుగోలు చేసిన వారికి పలు ఆఫర్స్ ప్రకటించాయి.

Aug 15th Offers :’యమహా ఇండియా మోటార్’ కళ్లు చెదిరే ఆఫర్లు, వాహనం కొంటే రూ.1లక్ష

Yamaha

Updated On : August 14, 2021 / 11:32 AM IST

Yamaha : ద్విచక్ర వాహనాలు కొనేవారు చాలా ఆలోచించి కొనుగోలు చేస్తుంటారు. ఏ కంపెనీకి సంబంధించింది కొనుగోలు చేయాలి..వాటి ఫీచర్స్ ఏంటీ తదితర వాటిని బేరీజు వేసుకుని మరీ కొనుగోలు చేస్తుంటారు. పండుగల సీజన్, ముఖ్యమైన తేదీల్లో కంపెనీలు ప్రకటించే డిస్కౌంట్లు, ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో…‘యమహా ఇండియా మోటార్’ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.

ఆగస్టు 15 దినోత్సవం సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ. లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్ లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది.
కరోనా సంక్షోభం నుంచి మార్కెట్ ఇప్పుడిప్పుడే కొలుకొంటోంది. వాహన రంగం పూర్తిగా డీలా పడిపోయింది. వాహన క్రయ, విక్రయాలు జరుగకపోవడంతో పలు కంపెనీలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడే పరిస్థితిలో మార్పు రావడంతో..వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.

Read More : Covaxin: ముక్కు నుంచి వ్యాక్సిన్.. క్లినికల్‌ ట్రయల్స్‌కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

2021, ఆగస్టు 15వ తేదీ సందర్భంగా..యమహా వాహనాలను కొనుగోలు చేసిన వారికి పలు ఆఫర్స్ ప్రకటించాయి. నాన్‌ ఐబ్రిడ్‌ వెహికల్‌ యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ వెహికల్స్‌, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ, యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్‌ఐ, యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ వాహనాలను ఆగస్ట్‌ 31లోగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇలా చేస్తే రూ.2,999 గిఫ్ట్‌ ఓచర్స్‌, రూ.20వేల వరకు అడిషనల్‌ బెన్‌ ఫిట్స్‌ పొందవచ్చని యమహా ఇండియా వెల్లడించింది.

Read More : Grandma Love Story : ఆమెకు 61, అతడికి 24… ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు

అయితే..తమిళనాడు రాష్ట్రాన్ని మినహాయించి…మిగిలిన రాష్ట్రాల్లో యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ, నాన్‌ ఐబ్రిడ్‌ వెహికల్‌ యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ, యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్‌ఐ వెహికల్స్‌ కొనుగోలు చేసిన వాహనదారులకు రూ.3,876 ఇన్స్యూరెన్స్‌ బెన్‌ ఫిట్స్‌, రూ.999కే లో డౌన్‌ పేమెంట్స్‌ తో బైక్‌ కొనుక్కొనే వీలుందని తెలిపింది.

Read More : Nasal Vaccine : ముక్కు ద్వారా వేసే టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో మాత్రం యమహా వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో స్క్రాచ్ కార్డు ద్వారా రూ. 30 వేల విలువైన గిఫ్ట్ తో పాటు బంపర్ ఆఫర్ కింద రూ. 1 లక్ష రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అడిషనల్ బెనిఫిట్స్ కింద రూ. 20 వేలు దక్కించుకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మిగిలిన అన్నీ మోడల్స్‌ పై రూ. 2,999 విలువైన బహుమతులు, రూ.20వేల అడిషనల్‌ బెన్‌ ఫిట్స్‌ను పొందవచ్చని యమహా తెలిపింది.