ఇండియాలో లాంచ్ : యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు వచ్చేసింది

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రెండు కొత్త సర్వీసులను ఇండియాలో లాంచ్ చేసింది. యూట్యూబ్ కు సంబంధించిన రెండు కొత్త యాప్ లను గూగుల్ ప్రవేశపెట్టింది.

  • Published By: sreehari ,Published On : March 13, 2019 / 10:31 AM IST
ఇండియాలో లాంచ్ : యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు వచ్చేసింది

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రెండు కొత్త సర్వీసులను ఇండియాలో లాంచ్ చేసింది. యూట్యూబ్ కు సంబంధించిన రెండు కొత్త యాప్ లను గూగుల్ ప్రవేశపెట్టింది.

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రెండు కొత్త సర్వీసులను ఇండియాలో లాంచ్ చేసింది. యూట్యూబ్ కు సంబంధించిన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంను గూగుల్ ప్రవేశపెట్టింది. యూట్యూబ్ మ్యూజిక్ యాప్, యూట్యూబ్ ప్రీమియం (యూట్యూబ్ రెడ్) సర్వీసు. స్పీడన్ కు చెందిన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం స్పాటిఫై (Spotify) యాప్ సర్వీసును నెలక్రితమే భార‌త్‌లో లాంచ్ చేసింది. స్పాట్ ఫై తమ సర్వీసులను భారత్ లో ప్రారంభించడంతో గూగుల్ కూడా యూట్యూబ్ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పాటీఫై తర్వాత భారత్ లో గ్లోబల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసును అందించే రెండో అతిపెద్ద సంస్థగా గూగుల్ నిలిచింది. 

మ్యూజిక్ Appలో ఫ్రీ.. ప్రీమియం
ఇప్పటికే యూట్యూబ్ భారత్ లో సేవలు అందిస్తుండగా.. ప్రత్యేకించి ఇండియన్ యూజర్ల కోసం యూట్యూబ్ మ్యూజిక్ యాప్, యూట్యూబ్ ప్రీమియం సర్వీసును ప్రవేశపెట్టింది. యూట్యూబ్ మ్యూజిక్ Free, Premium Tiers లో అందుబాటులో ఉంది. యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ద్వారా ఆడియో, వీడియోలు ప్లే చేయొచ్చు. ఫ్రీ మ్యూజిక్ యూజర్లు యాడ్స్ తో ఆడియో వినొచ్చు. ఆఫ్ లైన్లో కూడా ఫ్రీ యూజర్లు వినొచ్చు.
Read Also : డోంట్ మిస్ : రెడ్ మి నోట్ 7 ప్రొ.. సేల్ టుడే : ధర ఎంతంటే?

యూట్యూబ్ ప్రీమియంలో నో యాడ్స్.. 
యూట్యూబ్ ప్రీమియం సర్వీసులో యాడ్స్ లేకుండా TV షోలు, మూవీలు వీక్షించవచ్చు. ప్రీమియం మ్యూజిక్ యూజర్లు ఆడియో స్ట్రీమింగ్ సమయంలో హైక్వాలిటీ మ్యూజిక్, యాడ్స్  లేకుండా వినొచ్చు. యూట్యూబ్ ప్రీమియం యూజర్లు ఫ్యామిలీ ప్లాన్ పొందాలంటే నెలకు రూ.189 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్ యూజర్లలో ఆరుగురు యూజర్లు ఈ సర్వీసు నుంచి బెనిఫెట్స్ పొందొచ్చు. ఇందుకు యూట్యూబ్ మెంబర్ షిప్ సబ్ స్ర్కిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నీ యూట్యూబ్ ఒరిజినల్స్ ను ఆఫ్ లైన్ లో కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

నెలకు రూ.99 చెల్లిస్తే చాలు..
గూగుల్ ప్లే నుంచి యూట్యూబ్ మ్యూజిక్ సబ్ స్ర్కైబర్లు Youtube Music, Youtube Premium ను యాక్సస్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్ యాప్స్ ను డౌన్ లోడ్ చేయొచ్చు. దీంతో పాటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం కూడా అందిస్తోంది. ప్రీమియం యాప్ సర్వీసు పొందాలంటే నెలకు రూ99 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్ మ్యూజిక్ యాప్ సర్వీసు ద్వారా ఇండియన్ మార్కెట్ లో మిలియన్ల మంది అభిమానులను ఆకట్టుకుంటుందని గూగుల్ భావిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ ప్రారంభ ధర నెలకు రూ.129కే పొందొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S10 యూజర్లకు ఆఫర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్10 యూజర్లకు నాలుగు నెలల పాటు యూట్యూబ్ మ్యూజిక్ ఉచితంగా పొందొచ్చు. యూట్యూబ్ ప్రీమియంపై Add-free యాక్సస్ పొందొచ్చు. ఇప్పటికే ఇండియా ఆన్ లైన్ మార్కెట్ లో గానా, స్వాన్, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ ఆడియో స్ట్రీమింగ్ సర్వీసులు పాపులారిటీ సాధించాయి. 

వీటికి పోటీగా యూట్యూబ్ కూడా మ్యూజిక్, ప్రీమియం సర్వీసులను అందిస్తోంది. డెలాయిట్, ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ IMI, ఆడియో,వీడియో, OTT మార్కెట్ (Hotstar, Netflix, Prime Video, Sony LIV) ప్లాట్ ఫాంల్లో మొత్తం ఇండియాలో 280 మిలియన్ల బిజినెస్ నడుస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఆడియో OTT మార్కెట్.. దాదాపు 150 మిలియన్ల నెలసరి యాక్టివ్ యూజర్లకు మిలియన్ల కొద్ది సౌండ్ ట్రాక్స్ ను అందిస్తోంది. 
Read Also : గెలుపోటముల్లో 5శాతం ఇంపాక్ట్ : అభ్యర్థుల రాతను డిసైడ్ చేస్తున్న సోషల్ మీడియా