YouTube Videos Removal: క్యాన్సర్ చికిత్సపై తప్పుడు వీడియోలు.. యూట్యూబ్ కీలక నిర్ణయం

కచ్చితమైన చికిత్స ఉన్నప్పటికీ.. నిరాధారమైన చికిత్సను ప్రోత్సహించే వీడియోలు, హాని కలిగించే వీడియోలను తొలగించనున్నట్లు యూట్యూబ్ తెలిపింది.

YouTube Videos Removal: క్యాన్సర్ చికిత్సపై తప్పుడు వీడియోలు.. యూట్యూబ్ కీలక నిర్ణయం

Youtub videos

Updated On : August 17, 2023 / 12:31 PM IST

YouTube: స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను ఏదోఒక సమయంలో వీక్షిస్తూనే ఉంటారు. వీటిలో కొన్ని కచ్చితమైన సమాచారంతో కూడిన వీడియోలతో పాటు తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలుకూడా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కొందరు తప్పుడు సమాచారంతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వీటిని అనుసరించే పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ రంగంసిద్ధం చేసింది.

YouTube Premium Subscription : యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ 3 నెలలు ఉచితం.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

ప్రధానంగా క్యాన్సర్ చికిత్సపై యూట్యూబ్‌లో పెట్టే తప్పుడు వీడియోలను తొలగించేందుకు నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), వైద్య ఆరోగ్యశాఖ చెప్పే సమాచారానికి విరుద్దంగా, వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉన్న వీడియోలను తొలగించనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. తప్పుదోవ పట్టించే విషయాల్లో దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయడం మీద దృష్టిపెట్టాం. వైద్యపరమైన అంశాల్లో నిర్మూలన, చికిత్స, నిరాకరణకు సంబంధించి ఇప్పటి వరకు మావద్ద ఉన్న డజన్ల కొద్దీ విధానాలను క్రమబద్దీకరిస్తున్నాం అని యూట్యూబ్ తన బ్లాక్‌లో పేర్కొంది.

YouTube Earn Money : యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఇక మీ ఛానల్‌కు 500 సబ్‌స్ర్కైబర్లు ఉన్నా చాలు.. ఎవరైనా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు..!

కచ్చితమైన చికిత్స ఉన్నప్పటికీ.. నిరాధారమైన చికిత్సను ప్రోత్సహించే వీడియోలు, హాని కలిగించే వీడియోలు ఇక ఉండవు అని తెలిపింది. వెల్లుల్లితో క్యాన్సర్ నయం, రేడియేషన్ చికిత్సకు బదులు విటమిన్-సీ తీసుకోండి వంటి సూచనలు చేసే వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్ వెల్లడించింది. క్యాన్సర్ బారినపడిన వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు వ్యాధి లక్షణాలు, చికిత్స వంటి అంశాలను తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో పరిశోధిస్తారు. వారికి అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం అని యూట్యూబ్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది.