covid-19 : ఒకే ఇంటిలో..104 ఏళ్ల బామ్మతో సహా కరోనా నుంచి కోలుకున్నవృద్ధులు

104 Year Grandmother
Elderly people recovering from corona : ఈ మధ్య కాలంలో ఎంతోమంది వృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వృద్దాప్యంలోకూడా కరోనాను మట్టికరిపిస్తున్నారు. యువకుల మించిన పోరాటం చేసి కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తున్నారు. అటువంటివారిలో మన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు వృద్ధులు కరోనాను జయించారు. వారిలో 104 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉండటం విశేషం.
ఒకే కుటుంబంలోని ముగ్గురు వయో వృద్ధులు కరోనా బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాదు ఇటీవలే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. మరో విచిత్రం ఏంటంటే వీరిలో రంగనాయకమ్మ అనే ఓ బామ్మ వయసు 104 సంవత్సరాలు. శతాధిక వృద్ధురాలైనా కరోనాను మట్టి కరిపించిని ధీరగా నిలిచారీమె.
ఈ విషయాలను వారి మనవడు వినయ్ తెలిపారు. తాను హైదరాబాద్‌లోని ఉప్పల్, మేడిపల్లిలో ఉంటున్నామని, గతేడాది తన మా తాతమ్మ,ఆమె కుమారుడు.. మా 88 ఏళ్ల తాతయ్య రామానుజాచార్యులు, మా బామ్మ 79 ఏళ్ల లక్ష్మమ్మ కరోనా నుంచి కొలుకున్నారని తెలిపారు.