Hyderabad: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ పోలీసుల వార్నింగ్

పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది.

Hyderabad: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ పోలీసుల వార్నింగ్

Hyderabad police

Updated On : October 28, 2024 / 8:51 AM IST

144 section Implementation in Hyderabad : పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది. సోమవారం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీస్ శాఖ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ తెలిపారు. ఇవాళ్టి నుంచి 28-11-2024 వరకు అంటే నెల రోజుల పాటు 144 సెక్షన్ నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.

Also Read: TGSP Police : తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం.. ఆ 10 మంది టీజీఎస్పీల డిస్మిస్!

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మికూడి ఉండొద్దని, ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కార్యాలయం విడుదల చేసిన నోట్ లో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సీపీ నగర ప్రజలను కోరారు.